Kejriwal : కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు
కేజ్రీవాల్ కస్టడీని సెప్టెంబర్ 3న తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం తీర్పునిచ్చారు. సీబీఐ కేసులో ఇంతకుముందు విధించిన కస్టడీ గడువు నేటితో ముగియడంతో కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.
- By Latha Suma Published Date - 05:28 PM, Tue - 27 August 24

Kejriwal: మనీలాండరింగ్‌కు సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. కేజ్రీవాల్ కస్టడీని సెప్టెంబర్ 3న తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం తీర్పునిచ్చారు. సీబీఐ కేసులో ఇంతకుముందు విధించిన కస్టడీ గడువు నేటితో ముగియడంతో కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. మరోవైపు కేజ్రీవాల్ తోపాటు మరో ఐదుగురిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ దాఖలు చేసిన నాల్గో అనుబంధ ఛార్జీషీట్ పైన కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది. దీనిపై సెప్టెంబర్ 3న విచారణ జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఇప్పటికే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈడీ కేసులో బెయిల్ లభించినా సీబీఐ కేసులో బెయిల్ రానందున ఆయన తిహార్ జైల్లోనే ఉంటున్నారు.
మరో వైపు ఇదే కేసుకు సంబంధించి బీఆరెఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈరోజు బెయిల్ మంజూరైంది. సుప్రీం కోర్టులో జరిగిన సుదీర్ఘ వాదనల తర్వాత ఆమెకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 2024, మార్చి 15 వ తేదీన కవిత ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.