HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Kcr Meets Thackeray Concerned About Political Environment Misuse Of Central Agencies

KCR Meets Thackery : ‘ఠాక్రే, శరద్ పవార్’ లతో ‘తెలంగాణ సీఎం’ కీలక భేటీ… ‘కేసీఆర్’ స్కెచ్ అదిరిందిగా..!

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా కూడా ఇంకా ఎన్నో సమస్యలు అలానే ఉన్నాయని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని గులాబీ బాస్ తేల్చి చెప్పారు.

  • By Hashtag U Published Date - 07:17 PM, Sun - 20 February 22
  • daily-hunt
Kcr Uddhav
Kcr Uddhav

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా కూడా ఇంకా ఎన్నో సమస్యలు అలానే ఉన్నాయని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని గులాబీ బాస్ తేల్చి చెప్పారు. దేశ రాజకీయాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తో చర్చించినట్లు పేర్కొన్న కేసీఆర్.. ఇంకా అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ముందుగా ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను ఆయన నివాసంలో కేసీఆర్ కలిశారు. అనంతరం రెండు గంటలపాటు వారిరువురు చర్చించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు సీఎంలు కలిసి మీడియాతో తమ మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ…. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో దేశంలో రావాల్సిన మార్పులపై చర్చించినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా సమాలోచనలు చేసినట్లు గులాబీ దళపతి పేర్కొన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలు అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్రల మధ్య 1000 కిలో మీటర్ల మేర ఉమ్మడి సరిహద్దు ఉందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు మంచి అవగాహనతో ముందుకు నడవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ సూచించారు.

మరోవైపు భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. కేంద్ర- రాష్ట్ర సంబంధాల్లో మార్పు రావాలని కేసీఆర్ అన్నారు. కేంద్ర సంస్థలను మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ తమ వైఖరి మార్చుకోకుంటే.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు. ఇంకా అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని తెలంగాణ సీఎం ప్రకటించారు. కార్యాచరణ, చర్చలు ఇవాళే ప్రారంభమయ్యాయన్న కేసీఆర్…. ఉద్ధవ్‌ ఠాక్రేను హైదరాబాద్‌ కు రావాలని ఆహ్వానించినట్లు వెల్లడించారు.

నేషనల్ పాలిటిక్స్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో చర్చించినట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. దేశాభివృద్ధికి అవసరమైన కార్యాచరణపై ఇరువురు చర్చించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం తమ మధ్య జరిగిన చర్చలు కేవలం ఆరంభం మాత్రమేనని… ముందుముందు ఇంకా చర్చలు జరపనున్నట్లు ఠాక్రే తెలిపారు. తమ చర్చల్లో రహస్యమేమీ ఉండదన్న ఠాక్రే… దేశంలో మార్పు కోసం ఏం చేసినా బహిరంగంగానే చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రతీకార రాజకీయ నడుస్తున్నాయని… ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. సోదర రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ కలిసి నడుస్తాయని ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే చెప్పుకొచ్చారు.

మహారాష్ట్ర సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు జాతీయ రాజకీయాలపైనే ప్రధానంగా చర్చించారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం సాగిందని… మొదటినుంచి తెలంగాణకు శరద్ పవార్ మద్దతిచ్చారని కేసీఆర్ వెల్లడించారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేయాలని ఇద్దరు నేతలు నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. త్వరలోనే మరికొంత మంది నేతలతో సమావేశం కానున్నట్లు తెలిపిన కేసీఆర్… అందరితో చర్చించి, ఒక ఎజెండా రూపొందించి ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.

Kcr Uddhav 1

CM KCR and CM Thackery addressing media in Mumbai


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anti bjp
  • anti modi stand
  • cm kcr
  • federal front
  • KCR meets Thackery
  • national politics
  • sharad pawar
  • uddhav thackery

Related News

    Latest News

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd