KC Venugopal : భారత్ జోడో నుంచి ఢిల్లీకి వేణుగోపాల్
భారత్ జోడో యాత్రను సర్వం తానై చూసుకుంటోన్న ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అత్యవసరంగా సోనియాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు.
- By CS Rao Published Date - 04:42 PM, Tue - 20 September 22

భారత్ జోడో యాత్రను సర్వం తానై చూసుకుంటోన్న ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అత్యవసరంగా సోనియాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆమె పిలుపుతో పాదయాత్రలో ఉన్న ఆయన హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. పాదయాత్ర ప్రారంభమైన తరువాత భారత్ జోడో నుంచి వెళ్లడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్ సంస్థాగత సంస్కరణల గురించి మాట్లాడేందుకు సోనియా ఆయన్ను అత్యవసరంగా పిలిపించినట్టు ఢిల్లీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం.
భారత్ జోడో యాత్రలో కేరళ రాష్ట్రంలోని జిల్లాలో రాహులతో కేసీ వేణుగోపాల్ ఉన్నారు. సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభమైన తర్వాత ఆయన నిష్క్రమించడం ఇదే తొలిసారి. నేటితో యాత్ర 13వ రోజుకు చేరుకుంది. కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ సోమవారం పార్టీ అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా గాంధీ నుండి ఆమోదం పొందారు. మరుసటి రోజే వేణుగోపాల్ ను ఢిల్లీకి సోనియా పిలవడంపై ఆసక్తి నెలకొంది.
గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా భావించే అశోక్ గెహ్లాట్ తొలి నుంచి రాహుల్ గాంధీకి అండగా ఉంటున్నారు. అధ్యక్ష పదవిని రాహుల్ చేపట్టాలని పదేపదే కోరుతున్నారు. గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. అక్టోబరు 17న జరగనున్న ఎన్నికలలో పార్టీ అధ్యక్ష పదవికి గెహ్లాట్ ప్రముఖంగా ఎంపిక అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీని ఫలితం అక్టోబర్ 19న ప్రకటించబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సోనియా ఢిల్లీలో వేణుగోపాల్ తో జరిపే చర్చలు కీలకంగా కానున్నాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
Related News

Congress : తెలంగాణలో ఇంటింటికి కాంగ్రెస్ నేతలు.. సిక్స్ గ్యారెంటీలపై ప్రజలకు వివరణ
హైదరాబాద్‌లో 'విజయ భేరి' బహిరంగ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నేతలు సోమవారం తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ