Modi to Lord Rama: నరేంద్రమోదీని శ్రీరాముడితో పోల్చిన కంగనా
ప్రధానమంత్రి నరేంద్రమోదీని శ్రీరాముడితో పోల్చారు నటి కంగనా రనౌత్. ఈ రోజు ప్రధాని మోడీ తన 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని మోడీకి కంగనా శుభాకాంక్షలు తెలిపింది.
- By Praveen Aluthuru Published Date - 03:26 PM, Sun - 17 September 23

Modi to Lord Rama: ప్రధానమంత్రి నరేంద్రమోదీని శ్రీరాముడితో పోల్చారు నటి కంగనా రనౌత్. ఈ రోజు ప్రధాని మోడీ తన 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని మోడీకి కంగనా శుభాకాంక్షలు తెలిపింది. ఆయన పేరు శ్రీరాముడిలాగా చైతన్యంలో నిలిచిపోయిందంటూ వ్యాఖ్యలు చేసింది.ఈ రకంగా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టడంతో అందరి దృష్టి ప్రస్తుతం ఆమె పోస్టుపైనే పడింది. కొందరు దానిని సమర్దిస్తుంటే, మరికొందరు కంగనా పోలికను వ్యతిరేకిస్తూ రీట్వీట్స్ చేస్తున్నారు.రాముడిలా మీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుందని, మీరు సుదీర్ఘమైన మరియు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను సార్ అంటూ కంగనా పేర్కొంది.
కంగనా ప్రస్తుతం రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన చంద్రముఖి2 చిత్రంలో నటించింది. రజనీకాంత్, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చంద్రముఖి బ్లాక్‌బస్టర్ తమిళ చిత్రానికి ఇది సీక్వెల్.
ప్రధాని మోదీకి ఆదివారం 73 ఏళ్లు నిండాయి, ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ మోడీ పుట్టిన రోజును వివిధ రకాలుగా జరుపుతుంది. దేశవ్యాప్తంగా కార్యకర్తలు తమ అభిమాన నాయకుడి బర్తడేను ఘనంగా జరుపుతున్నారు.
Also Read: Chandrababu Will Win : ఏపీలో గెలవబోయేది చంద్రబాబే.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు