Champai Soren Convoy: మాజీ సీఎం భద్రతా కాన్వాయ్ వెనక్కి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
Champai Soren Convoy: ప్రోటోకాల్‌లను విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం నా భద్రత కోసం కేటాయించిన వాహనాలను ఉపసంహరించుకుంది అని చంపై సోరెన్ ఆరోపించారు. జార్ఖండ్‌లోని నా ప్రజల మధ్య నాకు ఎలాంటి భద్రత అవసరం లేదన్నారు.
- By Praveen Aluthuru Published Date - 08:01 PM, Wed - 25 September 24

Champai Soren Convoy: జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్ (champai soren) భద్రతా కాన్వాయ్‌లో మోహరించిన అన్ని వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా చంపాయ్ సోరెన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇది రాజకీయ కుట్ర అని, రాష్ట్ర ప్రజలే దీనికి సమాధానం చెబుతారని అన్నారు. అన్ని నియమాలు మరియు ప్రోటోకాల్‌లను విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం నా భద్రత కోసం కేటాయించిన వాహనాలను ఉపసంహరించుకుంది అని చంపై సోరెన్ ఆరోపించారు. జార్ఖండ్‌లోని నా ప్రజల మధ్య నాకు ఎలాంటి భద్రత అవసరం లేదన్నారు.
జార్ఖండ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత అమర్ కుమార్ బౌరీ కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో కూడా హేమంత్ ప్రభుత్వం రాజీ పడేందుకు సిద్ధంగా ఉందని మనసులో చాలా నిరాశ ఉందని ఆయన సోషల్ మీడియాలో రాశారు. ముఖ్యమంత్రికి మామ అంటే ఎందుకంత భయం? అని సూటిగా ప్రశ్నించారు. హేమంత్ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందంటే..అతనికి ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోందని తెలిపారు.
చంపై సోరెన్‌కు జెడ్ ప్లస్ (Z plus) కేటగిరీ భద్రత ఉండేది. మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (hemant soren)ను జనవరి 31న ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఫిబ్రవరి 2న రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు నుంచి బెయిల్ పొంది జూన్ 28న హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటకు రాగా.. ఆ తర్వాత ఆరో రోజు జూలై 3న చంపై సోరెన్ స్థానంలో మళ్లీ సీఎం అయ్యారు. హేమంత్ సోరెన్ క్యాబినెట్‌లో చంపై సోరెన్‌ను మంత్రిగా చేర్చారు. కొద్దిరోజుల తర్వాత ఆగస్ట్ 18న సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి తన బాధను వ్యక్తం చేశాడు. తాను సీఎం పదవికి రాజీనామా చేయడాన్ని అవమానకర రీతిలో తీసుకున్నారని అన్నారు. దీని తరువాత ఆగస్టు 28న అతను జేఎంఎం (JMM) ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేశాడు.
Also Read: Tirumala Laddu Controversy : పాప ప్రక్షాళన పూజకు జగన్ సిద్ధం ..టీడీపీ కౌంటర్