JD Vance : తాజ్ మహల్‌ను సందర్శించిన జేడీ వాన్స్ కుటుంబం
. తాజ్ మహల్ వద్ద సందడి చేసిన జేడీ వాన్స్ కుటుంబం, భార్య, పిల్లలతో సరదాగా కాలక్షేపం చేశారు. భారత్ పర్యటనలో ఆగ్రాకు వచ్చి తాజ్ మహల్ సందర్శించనున్నట్లు వారు ముందుగానే షెడ్యూల్ చేసుకున్నారు.
- By Latha Suma Published Date - 01:53 PM, Wed - 23 April 25

JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన కుటుంబంతో కలిసి ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్‌ను సందర్శించారు. ఆగ్రాకు వచ్చిన జేడీ వాన్స్ కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. సీఎం యోగి వెంట అధికారులు ఉన్నారు. తాజ్ మహల్ వద్ద సందడి చేసిన జేడీ వాన్స్ కుటుంబం, భార్య, పిల్లలతో సరదాగా కాలక్షేపం చేశారు. భారత్ పర్యటనలో ఆగ్రాకు వచ్చి తాజ్ మహల్ సందర్శించనున్నట్లు వారు ముందుగానే షెడ్యూల్ చేసుకున్నారు. మంగళవారం జైపూర్ లో గడిపిన జేడీ వాన్స్, ఉషా వాన్స్ దంపతులు బుధవారం ఉదయం యూపీలోని ఆగ్రాలో పర్యటిస్తున్నారు.
Read Also: BCCI Mourns Terror Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. బీసీసీఐ కీలక నిర్ణయం!
తమ పిల్లలతో కలిసి జేడీ వాన్స్, ఉషా దంపతులు తాజ్ మహల్ పైకి ఎక్కి నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రపంచ వింతను అతి దగ్గరగానే కాదు, తాకి చూడటంతో వారు చాలా సంతోషించారు. భారత్ అల్లుడైన జేడీ వాన్స్ తన నాలుగు రోజుల టూర్ లో భాగంగా దేశంలోని పలు పర్యాటక స్థలాల్ని సందర్శించనున్నారు. ఇక, జేడీ వాన్స్ టూర్ లో ఇరుదేశాల మధ్య పలు అంశాలపై చర్చలు జరిగే అవకాశముంది.
జేడీ వాన్స్ భారత పర్యటనలో రెండు దేశాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంపై చర్చించనున్నాయి. ఈ భేటీలో సుంకాలు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అంశాలపైనా ఇరుదేశాలు చర్చించే అవకాశం ఉంది.
Read Also: Amit Shah : శ్రీనగర్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా