Lawrence Bishnoi : అమెరికాలో డ్రగ్స్ స్మగ్లర్ సునీల్ హత్య.. లారెన్స్ గ్యాంగ్ ఎందుకీ మర్డర్ చేసింది ?
లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్(Lawrence Bishnoi)కు చెందిన షూటర్లు ఇంట్లోకి దూసుకెళ్లి సునీల్‌ను మర్డర్ చేశారు.
- By Pasha Published Date - 11:56 AM, Tue - 24 December 24

Lawrence Bishnoi : అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ సునీల్ యాదవ్ మర్డర్ జరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న స్టాక్‌టన్ ఏరియాలో ఉన్న సునీల్ ఇంట్లోనే ఈ హత్య జరిగింది. లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్(Lawrence Bishnoi)కు చెందిన షూటర్లు ఇంట్లోకి దూసుకెళ్లి సునీల్‌ను మర్డర్ చేశారు. రెండు రోజుల క్రితం ఈ హత్య జరగగా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మర్డర్ చేసింది తామేనని, ప్రతీకారం తీర్చుకున్నామని లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ రోహిత్ గొడారా సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. ‘‘సునీల్ యాదవ్ పంజాబ్ పోలీసులతో కలిసి మా గ్యాంగుకు చెందిన అంకిత్ భాదును గతంలో ఎన్‌కౌంటర్ చేయించాడు. అందుకే ఇప్పుడు మేం ప్రతీకారం తీర్చుకున్నాం. అతడిని చంపాం’’ అని రోహిత్ గొడారా వెల్లడించాడు. ‘‘అంకిత్ భాదు హత్య జరిగిన తర్వాత సునీల్ యాదవ్ పేరు బయటికి వచ్చింది. దీంతో భయపడ్డ సునీల్ భారత్ నుంచి అమెరికాకు పారిపోయాడు. అమెరికాలో ఉంటూ లారెన్స్ గ్యాంగ్ గురించి భారత పోలీసులకు సమాచారాన్ని సునీల్ చేరవేస్తున్నాడు’’ అని రోహిత్ ఆరోపించాడు.
Also Read :Onion Price: రైతులను కంటతడి పెట్టిస్తున్న ఉల్లి.. 20% ఎగుమతి సుంకాన్ని తొలగించాలని డిమాండ్!
సునీల్ యాదవ్ ఎవరు ?
సునీల్ యాదవ్ పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లా వాస్తవ్యుడు. ఒకప్పుడు లారెన్స్ బిష్ణోయి, రోహిత్ గొడారాలకు కూడా అతడు చాలా సన్నిహితుడు. అయితే అంకిత్ భాదు ఎన్‌కౌంటర్ జరిగినప్పటి నుంచి సునీల్ యాదవ్, లారెన్స్ గ్యాంగ్ మధ్య శత్రుత్వం మొదలైంది. రెండేళ్ల క్రితమే ఫేక్ పాస్‌పోర్టుతో భారత్ నుంచి దుబాయ్‌కు సునీల్ యాదవ్ పారిపోయాడు. దుబాయ్‌లో కొన్నాళ్లు సునీల్ గడిపాడు.ఆ టైంలో దుబాయ్ ప్రభుత్వంతో రాజస్థాన్ పోలీసులు చర్చలు జరిపారు. తమకు సునీల్‌ను అప్పగించాలని కోరారు. రాజస్థాన్‌లోని గంగా నగర్ జిల్లాలో పంకజ్ సోనీ అనే జ్యువెల్లర్ హత్య కేసులో సునీల్‌ను అరెస్టు చేశారు. బెయిల్‌లో ఉన్న టైంలో అతడు దుబాయ్‌కు పారిపోయాడని అప్పట్లో రాజస్థాన్ పోలీసులు చెప్పారు.
Also Read :Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు? కారణమిదే?
డ్రగ్స్ దందా..
భారత్‌లోని రాజస్థాన్‌లో పలు కేసుల్లో వాంటెడ్ జాబితాలో డ్రగ్స్ స్మగ్లర్ సునీల్ యాదవ్ పేరు ఉంది. సునీల్ యాదవ్ రాజస్థాన్‌లో ఉన్న టైంలో పాకిస్తాన్ మార్గం ద్వారా భారత్‌లోకి డ్రగ్స్‌ను తీసుకొచ్చేవాడు. అనంతరం ఆ డ్రగ్స్‌ను భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన నగరాల్లో విక్రయించేవాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటూ భారత్‌లో డ్రగ్స్ సప్లై రాకెట్‌ను సునీల్ నడుపుతున్నాడు. కొన్నేళ్ల క్రితం భారత్‌లో దొరికిన రూ.300 కోట్లు విలువైన డ్రగ్స్ స్టాక్‌తో కూడా సునీల్‌కు సంబంధం ఉందని అంటున్నారు.