HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Indias Signalling To China Exercises With Ins Vikramaditya And Ins Vikrant

India Vs China : చైనాకు చెక్.. ఇండియా కొత్త ప్లాన్

India Vs China : భూ సరిహద్దుల వెంట నిత్యం ఏదో ఒక సమస్యను సృష్టిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ రెడీ అయింది.. ఇందుకోసం సరికొత్త వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది.

  • By Pasha Published Date - 07:52 AM, Sun - 11 June 23
  • daily-hunt
India Vs China
India Vs China

India Vs China : భూ సరిహద్దుల వెంట నిత్యం ఏదో ఒక సమస్యను సృష్టిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ రెడీ అయింది.. 

ఇందుకోసం సరికొత్త వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది.

సముద్ర సరిహద్దుల నుంచి చైనాకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగింది.. 

ఇందులో భాగంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన నౌకాదళ యాక్టివిటీని పెంచింది. 

విమాన వాహక నౌకలు INS విక్రమాదిత్య, INS విక్రాంత్ లతో అరేబియా సముద్ర జలాల్లో భారత నౌకాదళం  సైనిక అభ్యాసాలు చేసింది..  ఈ రెండు విమాన వాహక నౌకలపై 35 యుద్ధ విమానాలతో పాటు పలు హెలికాఫ్టర్లు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు కూడా ఉన్నాయి.. అరేబియా సముద్రంలో ఓ వైపు పాక్ కు సహకారం అందిస్తూ..మరోవైపు స్వయంగా మోహరింపులు  పెంచుతున్న చైనాకు వార్నింగ్ ఇచ్చేందుకే(India Vs China) ఇండియా ఈ సైనిక అభ్యాసాలు చేసిందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.  తద్వారా మలక్కా జలసంధి నుంచి పర్షియన్ గల్ఫ్ వరకు వ్యూహాత్మక ఆసక్తి ఉన్న దాని ప్రాంతంలో సముద్ర సరిహద్దుల నియంత్రణపై రాజీపడేది లేదనే సంకేతాలను చైనాకు పంపింది. 

Also read :  China Urine Business : ఇండియాకు మూత్రం సప్లై లో చైనా టాప్.. ఆత్మ నిర్భర్ దిశగా ఇండియా

INS విక్రమాదిత్య, INS విక్రాంత్ లు ఒక్కొక్కటి  రోజుకు 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. ఇవి  ఒక్కొక్కటి 40,000 టన్నుల బరువును మోయగలవు. “ఈ నౌకాదళ పరాక్రమ ప్రదర్శన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడం, ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడుకోవడంతో పాటు సముద్ర ప్రాంతంలో సహకార భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో భారతదేశపు నిబద్ధతను నొక్కి చెబుతుంది” అని నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వల్ వెల్లడించారు.  మరోవైపు  చైనా ఇప్పటికే హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఏడెనిమిది నౌకలు, గూఢచారి నౌకలను మోహరించింది. అరేబియా సముద్రంలో భారత్‌ను సవాలు చేసేలా బలమైన నౌకా దళాన్ని నిర్మించుకోవడంలో పాకిస్థాన్‌కు సహాయం చేస్తోంది. చైనా దగ్గర కూడా లియానింగ్మ, షాన్‌డాంగ్ అనే రెండు విమాన వాహక నౌకలు ఉన్నాయి. 80,000 టన్నుల కంటే ఎక్కువ బరువున్న ఫుజియాన్‌ అనే విమాన వాహక నౌకను ప్రస్తుతం చైనా నిర్మిస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • exercises
  • india
  • India vs China
  • INS Vikramaditya
  • INS Vikrant

Related News

Ex Soldier India

Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది

  • 'relife' And 'respifresh Tr

    Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

  • H1b Visa

    H-1B వీసాపై మరిన్ని కఠిన నిబంధనలకు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్.!

Latest News

  • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

  • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

  • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

  • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

  • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

Trending News

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd