Google Doodle : డూడుల్‌తో ‘ఇండిపెండెన్స్ డే’ విషెస్ చెప్పిన గూగుల్
‘‘1947 సంవత్సరంలో ఇదే రోజు బ్రిటీష్ వలస పాలన నుంచి భారత్ విముక్తి పొందింది.. ఈసందర్భంగా మేం వీరేంద్ర జవేరీతో వేయించిన డూడుల్ ఇది’’ అని గూగుల్ ఓ పోస్ట్ చేసింది.
- By Pasha Published Date - 10:41 AM, Thu - 15 August 24

Google Doodle : భారత్ 78వ స్వాతంత్య్ర దినోత్సవానికి జరుపుకుంటున్న వేళ గూగుల్ తన డూడుల్‌తో క్రియేటివ్‌గా భారతీయులకు శుభాకాంక్షలు తెలిపింది. భారతదేశ గొప్ప ఆర్కిటెక్చర్‌ను అద్దంపట్టేలా క్రియేటివ్‌గా ఈ డూడుల్‌ను తయారు చేశారు. దీన్ని ఫ్రీలాన్స్ ఆర్ట్ డైరెక్టర్, ప్రఖ్యాత ఇల్లస్ట్రేటర్, యానిమేటర్ వీరేంద్ర జవేరితో గూగుల్ వేయించింది. ఈ డూడుల్‌లో 6 తలుపులు, కిటికీలు ఉన్నాయి. భారతదేశ ఆర్కిటెక్చర్ ఎంత గొప్పదో, ఎంత కళాత్మకమైందో తెలియాలంటే ఈ డూడుల్‌ను నిశితంగా చూడాల్సిందే. ఈ డూడుల్‌లో బ్లూ, ఎల్లో, గ్రీన్, సాఫ్రన్, బ్రౌన్ కలర్స్‌ను చూడచక్కగా వాడారు. భారత జాతీయ పక్షి నెమలి కూడా ఈ డూడుల్‌లో లైవ్లీగా కనిపిస్తూ అలరిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
‘‘1947 సంవత్సరంలో ఇదే రోజు బ్రిటీష్ వలస పాలన నుంచి భారత్ విముక్తి పొందింది.. ఈసందర్భంగా మేం వీరేంద్ర జవేరీతో వేయించిన డూడుల్ ఇది’’ అని గూగుల్ ఓ పోస్ట్ చేసింది. ‘‘సుదీర్ఘ పోరాటం తర్వాత బ్రిటీష్ వారి నుంచి భారత్‌కు విముక్తి లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం భారత్‌లో సెలవు దినం. ఎందుకంటే ఆ రోజున భారత స్వాతంత్య్ర సమరయోధుల బలిదానాలను భారతీయులంతా గుర్తు చేసుకుంటారు. దేశభక్తుల వీరోచిత పోరాటాన్ని అందరూ స్మరించుకుంటారు’’ అని గూగుల్ వివరించింది.
Also Read :CM Chandrababu: అన్న క్యాంటీన్లకు ప్రజలు విరాళాలివ్వాలి
‘‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’’.. అని మహాకవి గురజాడ అప్పారావు అన్నారు. ఆయన చెప్పిన విధంగా దేశమంటే ఏదో కొన్ని భవనాలు, ప్రాజెక్టులు, డ్యాములు, నదులు, పర్వతాలు కాదు. నదులు, పర్వతాలు వంటి వాటిని ప్రకృతి మనకు ప్రసాదించింది. భవనాలు, ప్రాజెక్టులు, డ్యాములను మనిషి నిర్మించుకున్నాడు. వీటన్నింటిని మించి దేశంలోని వ్యవసాయ రంగం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, విద్య వైద్య సదుపాయాలు, జీవన ప్రమాణాల ఆధారంగా ప్రపంచంలో గుర్తింపు లభిస్తుంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో చేరాలంటే ఆయా విభాగాల్లో దేశ బడ్జెట్ కేటాయింపులు పెరగాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రతి ఒక్కరు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది.