Indian Parliament : పార్లమెంట్లో `ఆదానీ`రచ్చ, అమెరికా `హిడెన్ బర్గ్` ప్రకంపనలు
పార్లమెంట్ వేదికగా(Indian Parliament) హిండెన్ బర్గ్ రీసెర్స్ సంస్థ
- Author : CS Rao
Date : 02-02-2023 - 12:54 IST
Published By : Hashtagu Telugu Desk
అదానీ గ్రూప్ మీద న్యూస్ భారత దేశానికి వర్తింప చేయొచ్చా? ఆయన కంపెనీపై ఆరోపణలు భారత్ పై దాడి కిందకు వస్తుందా? ఆ కోణం నుంచి ఆదానీ ఎందుకు తీసుకొస్తున్నారు? పార్లమెంట్ వేదికగా(Indian Parliament) అమెరికా కు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్స్ సంస్థ నివేదిక చర్చించడం అమెరికాను(America) వెనకేసుకు రావడం కిందకు వస్తుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది. ఆదానీ గ్రూప్ వ్యవహారం ప్రధాని మోడీ మెడకు చుట్టుకుంటోందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తోంది. దానికి క్లారిటీ ఇవ్వకుండా పార్లమెంట్ ను వాయిదా వేయడం విపక్ష లీడర్ల విమర్శలను ఎదుర్కొంటోంది.
పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ఆరోపణలు (Indian Parliament)
భారత్ భూభాగంలోకి చైనా చొచ్చుకు వస్తుందని పలుమార్లు పార్లమెంట్ వేదికగా(Indian Parliament) కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. అదంతా దేశ గోప్యతకు సంబంధించిన అంశంగా మోడీ సర్కార్ కొట్టివేస్తోంది. ఒక అంగుళం కూడా ఆక్రమణకు గురి కాలేదని చెబుతోంది. కాంగ్రెస్ మాత్రం చైనా ఆక్రమించుకుంటూ వస్తోందని ఆందోళన చెందుతోంది. ఇలాంటి వాదన తరహాలోనే భారత ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరడానికి ఆదానీ గ్రూప్ కారణంగా చెబుతోంది. మోడీ ప్రమోట్ చేస్తోన్న ఆదానీ గ్రూప్ వ్యవహారాన్ని అమెరికాకు(America) చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఒక వేదిక ద్వారా బట్టబయలు చేసింది. ఫలితంగా ఆదానీ గ్రూప్ సుమారు 7లక్షల ఓట్లు నష్టపోయిందని తెలుస్తోంది. అలాంటి కంపెనీకి భారత పబ్లిక్ రంగ సంస్థలను అమ్మేయడానికి మోడీ సిద్దపడుతున్నారని విపక్షాల ఆరోపణ.
Also Read : Parliament Winter Session: షెడ్యూల్ కంటే ముందే పార్లమెంట్ నిరవధిక వాయిదా
ఆదానీ గ్రూపు సంస్థలపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదికభారత స్టాక్ మార్కెట్ పైనే కాకుండా ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపెడుతోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ అంశం పార్లమెంట్ ను కూడా తాకింది. హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ మేరకు ఆ పార్టీ ఎంపీ కేశవరావు రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. దేశ ప్రజలు, దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపే రీతిలో ఆ నివేదిక ఉన్నట్లు తీర్మానంలో ప్రస్తావించారు. దీనిపై రూల్ 267 కింద చర్చ చేపట్టాలని కోరారు. మరోవైపు లోక్‌సభలోనూ ఇదే అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అదానీ గ్రూపు ఆర్ధిక అవకతవకలపై చర్చించాలని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కూడా ఉభయసభల్లోనూ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి.
Also Read : Union Budget : `మోడీ` మేడిపండు బడ్జెట్, రూ. 45లక్షల కోట్ల బడ్జెట్ లో రైతే లాస్ట్
ఇదే సమయంలో చైనా సరిహద్దుల్లో జరుగుతోన్న అంశంపై అమెరికాలోని రిపబ్లికన్లు స్పందించారు. భారత్ ,తైవాన్ విషయంలో చైనా దూకుడు ఆమోదనీయం కాదని రిపబ్లికన్ సెనేటర్లు అభిప్రాయపడ్డారు. ఆ విషయాన్ని చైనాకు చెప్పాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ను కోరారు. ఆంటోనీ బ్లింకెన్ చైనాలో పర్యటించడానికి ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. 2018 తర్వాత బీజింగ్ ను సందర్శిస్తున్న తొలి అమెరికా ప్రముఖుడు బ్లింకెన్ కావడం గమనార్హం. మ్యాక్రో రూబియో ఆధ్వర్యంలోని రిపబ్లికన్ సెనేటర్ల బృందం బ్లింకెన్ కు ఈ విషయమై ఓ లేఖ రాసింది.
పార్లమెంట్ వేదికగా విపక్షాలు వాయిదా తీర్మానాలు
బీజింగ్ సందర్శిస్తున్న బ్లింకెన్ వెంట అమెరికా ఆర్థిక శాఖ మంత్రి జానెట్ యెల్లెన్ ను ఉద్దేశించి కూడా సెనేటర్లు ఈ లేఖ రాశారు. హిమాలయ ప్రాంతంలో భారత్, తైవాన్ కు వ్యతిరేకంగా చైనా వ్యవహరిస్తున్న దురాక్రమణ వైఖరి ఆమోదనీయం కాదని చెప్పాలంటూ బ్లింకెన్, యెల్లెన్ ను వారు కోరారు. అదే సందర్భంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) ప్రచార విజయానికి దూరంగా ఉండాలని సూచించారు. చైనా మానవ హక్కుల ఉల్లంఘన, ఇండో పసిఫిక్ ప్రాంతంలో మిత్ర దేశాల పట్ల దూకుడైన విధానానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీని జవాబుదారీ చేయాలని కోరారు.
Also Read : union-budget : కేంద్ర వార్షిక బడ్జెట్ 2023
అటు అమెరికా ఇటు చైనా నడుమ భారత్ పరిస్థితి ఏమిటో చర్చించడానికి పార్లమెంట్ వేదికగా విపక్షాలు వాయిదా తీర్మానాలు పెట్టడం గమనార్హం. అయితే, వాటిని తిరస్కంచిన స్పీకర్లు ఉభయ సభలను షెడ్యూల్ ప్రకారం నడపాలని ప్రయత్నించారు. విపక్షాలు మాత్రం ఆదానీ గ్రూప్ అంశంపై చర్చించాలని నినాదాలు చేయడం ఆగలేదు. గతంలోనూ చైనా, భారత్ సరిహద్దు లో జరిగిన అంశాలపై చర్చకు మోడీ సర్కార్ సిద్ధపడలేదు. ఇప్పుడు ఆదానీ గ్రూప్ వ్యవహారంలోనూ చర్చకు భారత్ సర్కార్ సిద్ధంగా లేదు. ఇదే విషయాన్ని విపక్షాలు చెబుతూ మోడీ సర్కార్ ను పార్లమెంట్ బయట నిలదీయడం చర్చనీయాంశంగా మారింది.