HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >India Means Bharat Bharat Means India

India means Bharat : ఇండియా అంటే భారత్… భారత్ అంటే ఇండియా…

2016లో ఇండియా (India) పేరు తీసేసి భారత్ అనే పేరు మాత్రమే ఖరారు చేయాలని దాఖలైన పిటిష్ ను అప్పటి ధర్మాసనం కొట్టిపారేసింది.

  • Author : Hashtag U Date : 07-09-2023 - 11:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India Means Bharat... Bharat Means India...
India Means Bharat... Bharat Means India...

By: డా. ప్రసాదమూర్తి

India means Bharat : మన దేశానికి రెండు పేర్లు అవసరమా కాదా అన్నది ఎప్పుడో రాజ్యాంగ సభ సమావేశమైనప్పుడే పెద్ద చర్చ జరిగింది. కానీ మన వారు దీనిపై అప్పుడుప్పుడూ కొత్త చర్చ రేపి కొంత సమయం దాని మీద ఖర్చు పెడుతూ అందరి సమయాన్నీ ఖర్చు పెట్టిస్తూ వుంటారు. అయితే తాజాగా చెలరేగిన చర్చ అంత ఆషామాషీగా కొట్టేయడానికి వీల్లేనిదిగా వుంది. జి20 శిఖరాగ్ర సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ రచ్చ పుట్టింది. బహుశా ప్రపంచ దేశాలు కూడా దీని మీద దృష్టి పెట్టాలని కాబోలు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వారు ఈ చర్చను ఇప్పుడు ముందుకు తీసుకురావడానికి కారణాలు ఏమైనప్పటికీ, దేశం పేరు మార్చడం అనేది సాధ్యమా కాదా అనే మరో చర్చ కూడా సమాంతరంగా సాగుతోంది. ఈ విషయంలో ఎవరు మాట్లాడాలో వారే మాట్లాడాలి, అందరూ నోరు విప్పకండని సాక్షాత్తు ప్రధాని మోడీ తన అనుయాయులకు హితవు పలికారట.

అసలింతకీ ఇండియా (India) అనే పేరు ఉంచాలా వద్దా, కేవలం భారత్ (Bharat) అనే పిలవాలా అనేది రెండు సార్లు గతంలో అత్యున్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. 2016లో ఇండియా పేరు తీసేసి భారత్ అనే పేరు మాత్రమే ఖరారు చేయాలని దాఖలైన పిటిష్ ను అప్పటి ధర్మాసనం కొట్టిపారేసింది. ఇండియా అని పిలవాలంటే ఇండియా అని పిలవండి. భారత్ అని పిలవాలంటే భారత్ అని పిలవండి అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింద. అప్పట్లో ఈ విషయం మీద పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పి.ఐ.ఎల్) దాఖలు చేసిన పిటిష్ దారుని జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం తప్పు పట్టింది. పి.ఐ.ఎల్. అంటే ప్రజావ్యాజ్యం అనేది పేదల కొరకు ఉద్దేశించింది అని పిటిషన్ దారుడిని కోర్టు మందలించినట్టు కూడా తెలుస్తోంది.

రాజ్యాంగంలో దీనికి సంబంధించిన ఆర్టకల్ 1 లో మార్పులు చేసే పరిస్థితులు ఇప్పుడేమీ లేవని కూడా కోర్టు స్పష్టంగా చెప్పింది. రాజ్యాంగంలోని ఒకటో అధికరణం ఇండియా (India) అంటే భారత్ (Bharat) అని, అది విభిన్న రాష్ట్రాల కూటమి అని చెప్తోంది. అప్పుడు అధికారంలో ఉన్న ఇప్పటి బీజేపీ ప్రభుత్వమే స్వయంగా ఆ పిటిషన్ ని వ్యతిరేకించింది. దేశం పేరు విషయంలో రాజ్యాంగ సభ విస్తృతంగా చర్చ జరిపిందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ని సభ ఏకగ్రీవంగా ఆమోదించిందని, అప్పటికీ ఇప్పటికీ రాజ్యాంగ సభ నిర్ణయంలో ఎలాంటి మార్పులూ చోటు చేసుకోలేదని అప్పటి బీజేపీ హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత 2020 లో కూడా మరోసారి సుప్రీం కోర్టులో ఇండియా పేరు మార్పు కోరుతూ పిటిషన్ దాఖలైంది. అప్పుడు కూడా సుప్రీం కోర్టు పిటిషన్ కొట్టేసింది.

ఒకప్పుడు స్పష్టంగా ఇండియా (India) పేరు మార్చేది లేదని చెప్పిన బీజేపీ సర్కార్ ఇప్పుడెందుకు మరో పాట పాడుతోందనేదే పెద్ద ప్రశ్న. అందుకు రాజ్యాంగ సవణ అవసం. అది సాధ్యమా అన్నది న్యాయనిపుణులు చర్చిస్తున్నారు. పార్లమెంటులో బలం ఉంటే ఏదైనా సాధ్యమే కాని, ఆ అవసరం ఉందా లేదా అన్నదే అసలు విషయం. మాజీ అడిషనల్ సోలిసిటర్ జనరల్, సుప్రీం కోర్టు న్యాయవాది అమన్ లేఖి ఒక మాటన్నారు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనేది అధికారిక పదబంధం అని గుర్తు చేస్తూ మార్పు ఏదైనా సాధ్యమే. కానీ అది అవసరమా అనేదే చూడాలని ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్య చాలా విలువైంది. వివాద రహితమైన పలు సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించుకోవడం మంచిదని కూడా ఆయన సలహా ఇచ్చారు. వివాదాలు లేకపోతే రోజు గడవని వారికి ఇలాంటి మాటలు చెవికెక్కుతాయా?

ఈ విషయంలో అంబేద్కర్ ఏమన్నారో గుర్తుకు తెచ్చుకోవాలి. ఇండియా లేదా భారత్ (Bharat) ఏది ముందు అన్న చర్చ వచ్చినప్పుడు ఇండియా చరిత్ర పొడవునా ఇండియాగానే గుర్తింపబడిందని, ఐక్యరాజ్య సమితిలో కూడా ఇండియాగానే మన దేశం ఒక సభ్యదేశంగా నమోదైందని, అన్ని ఒప్పందాలూ ఇండియా పేరు మీదే సంతకాలు జరిగాయని అంబేద్కర్ అన్నారు. అందుకే ఆయన ఆర్టికల్ 1 సవరణను వ్యతిరేకంచారు. దీన్నే అప్పుడు అంతా ఆమోదించారు. గతంలో న్యాయాస్థానాల్లో ఈ వివాదం వచ్చినప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా అంబేద్కర్ వాదననే సమర్థించినట్టు కనపడుతోంది. మరిప్పుడు దేనికి ఈ కొత్త వివాదం అన్నదే పలువురి విజ్ఞుల ప్రశ్న. అయితే ఇప్పటి వరకూ ఈ విషయంలో బీజేపీ వారు ఏం స్టాండ్ తీసుకున్నా తాజాగా విపక్షాల కూటమి INDIA పేరు మీద ఒక్కటైన నేపథ్యలో, వారి కొత్త ఎత్తుగడ ఎలా వుంటుందా అన్నదే పెద్ద సందేహం.

Also Read:  Teenamar Mallanna New Party : తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టబోతున్నారా..? పార్టీ పేరు ఇదేనా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bharat
  • bjp
  • g20 summit
  • government
  • india
  • modi
  • World Leaders

Related News

    Latest News

    • Live Kitchen: హైదరాబాద్ లో ‘లైవ్ కిచెన్’ ఆవిష్కరణ

    • Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd