BrahMos Deal : భారత్‌తో ఇండోనేషియా బిగ్ డీల్.. రూ.3,800 కోట్ల బ్రహ్మోస్ క్షిపణులకు ఆర్డర్ ?
ఈ డీల్ ఖరారైతే.. భారత్‌లో తయారయ్యే బ్రహ్మోస్ మిస్సైళ్ల(BrahMos Deal) తయారీ విభాగానికి రెండో కస్టమర్‌గా ఇండోనేషియా మారుతుంది.
- By Pasha Published Date - 08:04 PM, Wed - 15 January 25

BrahMos Deal : రక్షణ రంగంలో భారత్ దూసుకుపోతోంది. ఆత్మ నిర్భరతను సాధించడంతో పాటు విలువైన రక్షణ రంగ ఉత్పత్తులను విదేశాలకు విక్రయించే రేంజుకు ఎదుగుతోంది. ఈక్రమంలో మరో పెద్ద డీల్ భారత్‌కు దక్కబోతోంది. దాదాపు రూ.3,800 కోట్లు విలువైన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులను భారత్ నుంచి కొనేందుకు ఇండోనేషియా రెడీ అయింది. ఈ అంశంపై గత ఏడేళ్లుగా ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భారత ప్రభుత్వంతో పాటు రష్యా ప్రభుత్వ సంస్థ రోసోబోరోనెక్స్‌పోర్ట్ కూడా భాగంగా ఉందని సమాచారం. ఈ డీల్ నేపథ్యంలో జనవరి 26వ తేదీన భారతదేశ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరుకానుండటం గమనార్హం.
Also Read :Crorepati Constable : ‘‘రూ.500 కోట్ల మాజీ కానిస్టేబుల్’’ మిస్సింగ్.. అతడి డైరీపై రాజకీయ రచ్చ
ఈ డీల్ ఖరారైతే.. భారత్‌లో తయారయ్యే బ్రహ్మోస్ మిస్సైళ్ల(BrahMos Deal) తయారీ విభాగానికి రెండో కస్టమర్‌గా ఇండోనేషియా మారుతుంది. బ్రహ్మోస్ అనే పేరులో భారత్‌కు చెందిన బ్రహ్మపుత్ర నది పేరు, రష్యాకు చెందిన మోస్క్వా నది పేరు కలిసి ఉన్నాయి. బ్రహ్మోస్ ఏరో స్పేస్ అనేది భారత్, రష్యా దేశాల జాయింట్ వెంచర్ కంపెనీ. ఇప్పటికే భారతదేశం నుంచి బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణుల బ్యాటరీలను ఫిలిప్పీన్స్ దేశం కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించి భారత్ – ఫిలిప్పీన్స్ మధ్య దాదాపు రూ.3,200 కోట్లు విలువైన ఒప్పందం కుదిరింది.
Also Read :Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఖలిస్తానీ మూకల ముప్పు.. ఆప్ అధినేత రియాక్షన్ ఇదీ
ప్రస్తుతం ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధంలో ఉంది. ఈ తరుణంలో రష్యాపై అమెరికా కఠినంగా ఆంక్షలను అమలు చేస్తోంది. దాని నుంచి రక్షణ ఉత్పత్తులు నేరుగా కొనే దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తోంది. ఈ తరుణంలో రష్యా మిత్రదేశమైన భారత్‌తో డీల్ కుదుర్చుకునే దిశగా ఇండోనేషియా అడుగులు వేస్తుండటాన్ని అమెరికా సైతం నిశితంగా పరిశీలిస్తోంది. అమెరికా ఆంక్షల వలయంలో చిక్కకుండా ఉండేందుకుగానూ.. బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైళ్లను నేరుగా కాకుండా, వాటి తయారీకి ఉపయోగపడే విడి భాగాలను ఇండోనేషియాకు భారత్ సరఫరా చేస్తుందని తెలుస్తోంది.