Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఖలిస్తానీ మూకల ముప్పు.. ఆప్ అధినేత రియాక్షన్ ఇదీ
ఈ హెచ్చరికలు వచ్చినా ఎన్నికల ప్రచారంలో రాజీపడకుండా కేజ్రీవాల్(Arvind Kejriwal) దూసుకుపోతున్నారు.
- Author : Pasha
Date : 15-01-2025 - 6:53 IST
Published By : Hashtagu Telugu Desk
Arvind Kejriwal : భారత నిఘా వర్గాలు సంచలన హెచ్చరికను జారీ చేశాయి. పాకిస్తాన్‌కు చెందిన గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో ఖలిస్తానీ మద్దతుదారులు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేసే ముప్పు ఉందని వెల్లడించాయి. ‘‘కేజ్రీవాల్‌పై దాడి చేసేందుకు ఇద్దరు, ముగ్గురు ఖలిస్తానీ మద్దతుదారులు పంజాబ్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. వారి వెనక పాక్ ఐఎస్‌ఐ హస్తం ఉంది. ఐఎస్ఐ దిశా నిర్దేశం మేరకు ఆ వ్యక్తులు నడుచుకుంటున్నారు’’ అని భారత నిఘా వర్గాలు తెలిపాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల దీన్ని కీలక పరిణామంగా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఈ హెచ్చరికలు వచ్చినా ఎన్నికల ప్రచారంలో రాజీపడకుండా కేజ్రీవాల్(Arvind Kejriwal) దూసుకుపోతున్నారు. ఇవాళ ఉదయం నామినేషన్ దాఖలు చేసిన ఆయన ప్రచార బరిలో జోరును పెంచారు.
Also Read :Russia Vs NATO : రంగంలోకి నాటో యుద్ధ విమానాలు.. పోలండ్ సరిహద్దుల్లో రష్యా దాడితో ఉద్రిక్తత
ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేసే అవకాశం ఉందనే వార్తలపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘‘పైవాడు నాతో ఉన్నాడు. ఆయనపై నాకు విశ్వాసం ఉంది. దేవుడే నా ప్రాణాలను రక్షిస్తాడు’’ అని ఆయన కామెంట్ చేశారు. ‘‘దేవుడు అండగా నిలిచే వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. దైవబలం నాతో ఉంది. ఎవరైనా సరే తమ జీవితరేఖ ఉన్నంతకాలం కచ్చితంగా బతికి తీరుతారు. ఆ తర్వాత దేవుడే వాళ్లను తన వద్దకు పిలుచుకుంటాడు’’ అని కేజ్రీవాల్ తెలిపారు.
Also Read :Reliance NU Suntech : ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంటుంది. పైలట్, ఎస్కార్ట్ టీమ్, తనిఖీ యూనిట్లు సహా దాదాపు 63 మంది సిబ్బంది ఆయనకు నిత్యం భద్రత కల్పిస్తుంటారు. ఇందుకు అదనంగా 15 మంది సీఏపీఎఫ్ సాయుధ బలగాల పహారా సైతం కేజ్రీవాల్‌కు లభిస్తుంది. ఈ భద్రతా వలయాన్ని ఛేదించి కేజ్రీవాల్‌పై ఉగ్రమూకలు దాడి చేయడం అనేది దాదాపు అసాధ్యం. అందుకే కేజ్రీవాల్ ధీమాగా ఉన్నారు. భద్రతా సిబ్బంది తనకు రక్షణ కల్పిస్తారని ఆయన నమ్ముతున్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వస్తాయి.