China Reaction: ఆర్టికల్ 370.. సుప్రీంకోర్టు తీర్పుపై చైనా విమర్శలు..!
ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పాకిస్థాన్‌తో పాటు చైనా (China Reaction) కూడా ఉలిక్కిపడింది. బుధవారం చైనా మళ్లీ లడఖ్‌ను క్లెయిమ్ చేసింది.
- By Gopichand Published Date - 02:28 PM, Thu - 14 December 23

China Reaction: ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పాకిస్థాన్‌తో పాటు చైనా (China Reaction) కూడా ఉలిక్కిపడింది. బుధవారం చైనా మళ్లీ లడఖ్‌ను క్లెయిమ్ చేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. “కేంద్రపాలిత ప్రాంతంగా పిలవబడే లడఖ్‌ను చైనా ఎన్నడూ గుర్తించలేదు. ఇది భారతదేశం ఏకపక్షంగా, చట్టవిరుద్ధమైన నిర్ణయం.” అని పేర్కొంది. ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు నిర్ణయంపై, మావో మాట్లాడుతూ.. “చైనా-భారత్ సరిహద్దులోని పశ్చిమ ప్రాంతంపై చైనాకు అధికారం ఉందనే వాస్తవాన్ని భారత దేశీయ కోర్టు నిర్ణయం మార్చదు.” అన్నారు.
మంగళవారం ముస్లిం దేశాల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) కూడా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకించింది. అయితే భారత ప్రభుత్వం సంస్థ ప్రకటనను తీవ్రంగా విమర్శించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశం ఆదేశానుసారం ఓఐసీ ఇదంతా చేస్తోందని, అందుకే ఓఐసీ చర్య అనుమానాస్పదంగా ఉందని పాకిస్థాన్ పేరు చెప్పకుండా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తూ OIC ఒక ప్రకటన విడుదల చేసింది. జమ్మూకశ్మీర్ ప్రజలకు మేం అండగా ఉంటాం అని ఆ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయంగా వివాదాస్పద ప్రాంతంలో భారత్ మార్పులు చేసిన విషయం తెలిసిందే.
Also Read: Nara Lokesh: చంద్రబాబు అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం : నారా లోకేశ్
కోర్టు నిర్ణయం ఏమిటి?
ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుందని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది. ఇది కాకుండా జమ్మూ కాశ్మీర్‌లో 2024 సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది.
We’re now on WhatsApp. Click to Join.
పాకిస్థాన్ వైఖరి?
ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పాకిస్థాన్ విమర్శలు మొదలయ్యాయి. ఈ నిర్ణయానికి సంబంధించి పాక్ తాత్కాలిక విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ చట్టం భారత్ నిర్ణయాన్ని గుర్తించదని అన్నారు. ఇది ఏకపక్ష నిర్ణయం. చట్టపరంగా సరైనది కాదని పేర్కొంది.