HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Ias Officer Pooja Singhal Arrested In Jharkhand Money Laundering Case Sent To Ed Custody For 5 Days

Pooja Singhal : శ్రీల‌క్ష్మి త‌ర‌హాలో ఐఏఎస్ పూజ బ‌లి

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు ఈడీ దెబ్బ‌కు దొరికిపోయారు.

  • By CS Rao Published Date - 02:10 PM, Thu - 12 May 22
  • daily-hunt
Puja Singhal
Puja Singhal

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు ఈడీ దెబ్బ‌కు దొరికిపోయారు. ఈడీ త‌నిఖీల్లో గుట్ట‌లుగా ప‌డి ఉన్న డ‌బ్బును స్వాధీనం చేసుకున్నారు. ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ IAS అధికారి మరియు మైనింగ్ సెక్రటరీ పూజా సింఘాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. మైనింగ్ మాఫియాతో క‌లిసి మ‌నీ లాండరింగ్ కు పాల్ప‌డిన‌ట్టు ప్రాథ‌మికంగా గుర్తించారు. ఆనాడు ఉమ్మ‌డి సీనియ‌ర్ అధికారిణి శ్రీల‌క్ష్మి త‌ర‌హాలోనే పూజా సింఘాల్ ప‌ట్టుబ‌డ్డారు.

MGNREGA నిధుల దుర్వినియోగం, ఇతర అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సీనియర్ IAS అధికారి మరియు మైనింగ్ సెక్రటరీ పూజా సింఘాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. RTI ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వకపోవడంతో ఆమెపై అనుమానం పెరిగిందని వర్గాలు పేర్కొన్నాయి. ఈడీ ఆమెను ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరిచ‌గా ఐదు రోజుల రిమాండ్ విధించారు.

జార్ఖండ్ రాజ‌కీయం ఇప్పుడు పూజా సింఘాల్ అరెస్ట్ చుట్టూ తిరుగుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, అధికార పార్టీ నేతలు ఖండించారు. సీఎం హేమంత్ సోరెన్ ఆదేశానుసారంగా ఐఏఎస్ పూజా సింఘాల్ న‌డుచుకున్నార‌ని విప‌క్షాల ఆరోప‌ణ‌. ఆమె చేసిన లావాదేవీల వెనుక హేమంత్ ప్ర‌మేయం ఉంద‌ని అనుమానిస్తున్నారు. సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఒక వైపు ఐఏఎస్ అధికారిణి అరెస్ట్ మ‌రో వైపు సీఎం రాజీనామా డిమాండ్ గ‌తంలో ఉమ్మ‌డి ఏపీలో జ‌రిగిన మైనింగ్ అక్ర‌మ వ్య‌వ‌హారాల సీన్ గుర్తు కొస్తోంది.

ఉమ్మ‌డి ఏపీ సీఎంగా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉన్న‌ప్పుడు శ్రీల‌క్ష్మి మైనింగ్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. ఆమె ఓబులాపురం మైనింగ్ అనుమ‌తుల‌ను చ‌ట్ట‌విరుద్ధంగా ఇచ్చార‌ని ఆరోప‌ణ‌లను ఎదుర్కొన్నారు. అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ వైఎస్ రాజీనామాకు డిమాండ్ చేసిన సీన్ ఇప్పుడు గుర్తుకొస్తోంది. ఆ త‌రువాత వైఎస్ మ‌ర‌ణించ‌డంతో అక్ర‌మాల‌న్నీ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఫ‌లితంగా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిణి శ్రీల‌క్ష్మి ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ తో స‌హా జైలు జీవితం అనుభ‌వించారు. ఇప్ప‌టికీ ఆ కేసు విచార‌ణ కొన‌సాగుతోంది. సేమ్ టూ సేమ్ ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రంలో అదే సీన్ క‌నిపిస్తోంది.

మైనింగ్ లో కూడ‌బెట్టిన డ‌బ్బుకు సంబంధించి మానీల్యాండ‌రింగ్ జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లను ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సొరేన్, సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు ఎదుర్కొంటున్నారు. ఆ క్ర‌మంలో ఈడీ రంగంలోకి దిగి సీఎం అనుచ‌రులు, బంధువులు, స‌న్నిహితులు, అధికారుల ఇళ్ల‌లో త‌నిఖీల‌ను గ‌త కొన్ని రోజులుగా జ‌రుపుతోంది. వాళ్ల నుంచి పెద్ద ఎత్తున క‌రెన్సీ క‌ట్ట‌ల‌ను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ మొత్తం వ్య‌వ‌హారం సీఎం హేమంత్ సొరేన్ కు చుట్టుకునేలా క‌నిపిస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Enforcement Directorate (ED)
  • jharkhand
  • money laundering probe
  • Pooja Singhal

Related News

    Latest News

    • ‎Jujube: రేగి పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం!

    • ‎Hair Growth: పది రూపాయల పెరుగు ప్యాకెట్ తో ఇలా చేస్తే చాలు.. జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం ఖాయం!

    • ‎Leaves Benefits: ఈ చిన్ని ఆకులతో షుగర్ తగ్గడం నుంచి జుట్టు పెరగడం వరకు ఎన్నో లాభాలు!

    • Harish Rao Father Died : హరీశ్ రావు తండ్రి కన్నుమూత

    • ‎Weight Loss: ఇవి తింటే చాలు.. జిమ్ తో అవసరం లేకుండా పొట్టలో కొవ్వు కరిగిపోవడం ఖాయం!

    Trending News

      • Shreyas Iyer In ICU: శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐసీయూలో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది?

      • Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!

      • Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!

      • Justice Surya Kant : హరియాణా నుంచి భారత్‌లో తొలి ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్.!

      • Burn Utensils: మాడిపోయిన పాత్రలను ఈజీగా శుభ్రం చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd