PM Modi – ChatGpt : ఛాట్ జీపీటీకి ప్రధాని మోడీ సలహా.. ఏమిటంటే ?
PM Modi - ChatGpt : ఫేక్ వీడియోలను రూపొందించడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తుండటంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆందోళన వ్యక్తం చేశారు.
- By Pasha Published Date - 02:55 PM, Fri - 17 November 23

PM Modi – ChatGpt : ఫేక్ వీడియోలను రూపొందించడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తుండటంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆందోళన వ్యక్తం చేశారు. అలా రూపొందించిన ఫేక్ వీడియోలను .. ‘ఫేక్’గా ఫ్లాగ్ చేయాల్సిన బాధ్యత ఏఐ టెక్నాలజీ కంపెనీలపై ఉంటుందన్నారు. ఈవిషయాన్ని తాను ఛాట్ జీపీటీ టీమ్ దృష్టికి కూడా తీసుకెళ్లానని ఆయన చెప్పారు. ఈసందర్భంగా ప్రధాని మోడీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘నేను గార్భా డ్యాన్స్ చేస్తున్నట్టుగా తయారుచేసిన డీప్ ఫేక్ వీడియో ఒకటి చూసి ఆశ్చర్యపోయాను. నేను గార్భా పాట కూడా పాడుతున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. నేనే రియల్‌గా డ్యాన్స్ చేశానా అన్నట్టుగా ఆ వీడియో ఉంది. అలాంటి వీడియోలు ఆన్‌లైన్‌లో చాలానే ఉన్నాయి’’ అని మోడీ చెప్పారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ ‘దీపావళి మిలన్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈ కామెంట్స్ చేశారు. ఇలాంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రధాన బాధ్యత మీడియాపై ఉందన్నారు.
Also Read: Mohammed Shami: షమీపై మరోసారి హసీన్ జహాన్ తీవ్ర ఆరోపణలు.. ఆటగాళ్లకు డబ్బులు ఇచ్చి ఔట్ చేస్తాడని కామెంట్స్..!
జనరేటివ్ AI ద్వారా తయారయ్యే ప్రతి ఫొటో, ప్రతి వీడియోపై అది డీప్ ఫేక్ అనే విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. అలా చేస్తేనే నిజమైన ఫొటోలకు, ఏఐ ఫొటోలకు తేడా తెలిసి వస్తుందని పేర్కొన్నారు. హీరోయిన్లు రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్‌ల ముఖాలను మార్ఫింగ్ చేసిన డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇటీవల వివాదానికి దారితీసింది. ఈనేపథ్యంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని(PM Modi – ChatGpt) సంతరించుకున్నాయి.