Massive Fire Breaks Out: గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం.. వీడియో వైరల్..!
గుజరాత్‌లోని సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) చోటు చేసుకుంది. సూరత్‌లోని ఓ కారు షోరూంలో భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి కారణం తెలియాల్సి ఉండగా
- Author : Gopichand
Date : 27-01-2023 - 8:20 IST
Published By : Hashtagu Telugu Desk
గుజరాత్‌లోని సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) చోటు చేసుకుంది. సూరత్‌లోని ఓ కారు షోరూంలో భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి కారణం తెలియాల్సి ఉండగా.. ఆస్తి, ప్రాణ నష్టం వివరాల గురించి ఇంకా స్పష్టత రాలేదు.
సూరత్‌లోని ఉద్నా ప్రాంతంలోని కార్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 8 అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. షోరూంలో ఫర్నీచర్‌తోపాటు 8 నుంచి 10 వాహనాలు దగ్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Suicide : ఢిల్లీలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
కొద్ది రోజుల క్రితం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని షాహీబాగ్ ప్రాంతంలోని భవనంలోని 7వ అంతస్తులో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఓ బాలిక మరణించింది. కాగా పలువురు చిక్కుకున్నారు. అహ్మదాబాద్‌లోని షాహీబాగ్ ప్రాంతంలోని ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఏళ్ల బాలికను భవనంలోని 7వ అంతస్తు నుంచి రక్షించారు. 108 బృందం కాలిపోయిన బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే చికిత్స పొందుతూ బాలిక మరణించింది. అయితే, చనిపోయిన బాలిక కుటుంబ సభ్యులు నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
#WATCH | Gujarat: A massive fire broke out at a car showroom in Surat's Udhna area. Fire tenders present at the spot. More details awaited. pic.twitter.com/pPXLWfR2gf
— ANI (@ANI) January 26, 2023