HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Good News Centre Increases Supply Of Commercial Cylinders

Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

  • Author : Vamsi Chowdary Korata Date : 27-03-2026 - 2:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good news for consumers: Commercial cylinder prices have dropped significantly.
Good news for consumers: Commercial cylinder prices have dropped significantly.

Central Government వాణిజ్య, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ల కేటాయింపు కోటాను 50 శాతం నుంచి 70 శాతానికి పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతులకు అంతరాయం ఏర్పడటంతో పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ పెంపులో భాగంగా ఉక్కు, ఆటోమొబైల్, టెక్స్‌టైల్, రసాయనాలు, ప్లాస్టిక్స్ వంటి కార్మిక ఆధారిత రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇతర పరిశ్రమలకు కూడా ఈ రంగాలు మద్దతుగా నిలుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న 50 శాతం కేటాయింపులకు అదనంగా మరో 20 శాతం సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

అయితే, ఈ అదనపు 20 శాతం కోటా పొందాలంటే వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు తప్పనిసరిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వద్ద నమోదు చేసుకోవడంతో పాటు తమ నగరాల్లోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల వద్ద పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రత్యేక ఉష్ణ ప్రయోజనాల కోసం ఎల్పీజీని వాడే పరిశ్రమలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని కూడా ఉత్తర్వుల్లో వివరించారు. సిలిండర్ల పంపిణీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు చూసుకుంటాయని తెలిపింది.

ఇదిలా ఉంటే… హ‌ర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే మరిన్ని భారతీయ ఎల్పీజీ నౌకలకు అనుమతి ఇచ్చేందుకు ఇరాన్ సానుకూలంగా స్పందించింది. ఈ విషయమై భారత అధికారులు జరిపిన చర్చలు ఫలించడంతో త్వరలో గ్యాస్ సరఫరా సంక్షోభం తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • automobile industry
  • central government
  • City Gas Distribution
  • commercial gas shortage
  • Commercial LPG
  • Commercial LPG cylinder
  • commercial lpg gas cylinders
  • Gas shortage
  • Iran War
  • LPG quota
  • Piped Natural Gas
  • Steel Industry
  • textile industry
  • US - Iran War
  • US - Iran War Effect
  • US-Israel-Iran War

Related News

Central Government Lifts Em

Gas supply : గ్యాస్ సరఫరా పై అత్యవసర ఆంక్షలను ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం

హర్మూజ్ జలసంధి మార్గంలో ద్రవీకృత సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ) రవాణా మళ్లీ సజావుగా సాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    Latest News

    • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

    • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

    • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

    • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

    • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd