G20 Summit: జి-20 సదస్సు ఎఫెక్ట్.. ఇతర ప్రాంతాలకు ఢిల్లీ యాచకులు..?!
సెప్టెంబర్ 9, 10 తేదీల్లో భారత్‌లో జరగనున్న జి-20 సదస్సు (G20 Summit)కు సన్నాహాలు చివరి దశలో ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు.
- Author : Gopichand
Date : 07-09-2023 - 10:35 IST
Published By : Hashtagu Telugu Desk
G20 Summit: సెప్టెంబర్ 9, 10 తేదీల్లో భారత్‌లో జరగనున్న జి-20 సదస్సు (G20 Summit)కు సన్నాహాలు చివరి దశలో ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌లో మార్పులు చేశారు. ఇది మాత్రమే కాదు యాచకులు, డ్రగ్స్ బానిసలు, నపుంసకుల ప్రవేశంపై కూడా నిషేధం విధించారు.
న్యూఢిల్లీ జిల్లాలోని కన్నాట్ ప్లేస్, జన్‌పథ్, బంగ్లా సాహిబ్ గురుద్వారా, కేజీ మార్గ్, హనుమాన్ మందిర్ పరిసరాల్లో కనిపించే యాచకులు, మాదకద్రవ్యాల బానిసలు, నపుంసకుల కదలికలపై ఆంక్షలు విధించబడ్డాయి. దీనితో పాటు హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్- న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పహర్‌గంజ్, అజ్మేరీ గేట్‌లకు ఇరువైపులా ఈ వ్యక్తుల ప్రవేశం నిషేధం విధించారు. ఎవరైనా కనిపిస్తే వారిని షెల్టర్ హౌస్ లో వదిలేస్తారు.
Also Read: Stock Market Opening: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..!
ఈ సమయంలో ఢిల్లీ పోలీసులు ప్రతిరోజూ ప్రెస్ బ్రీఫింగ్ ద్వారా ట్రాఫిక్‌తో సహా అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తారు. ఈ క్రమంలోనే బిచ్చగాళ్లు, మందుబాబులు, నపుంసకులకు కూడా పరిష్కారం కనిపెట్టి గీతాకాలనీ, రోహిణి, ద్వారకా సెక్టార్-3 శివారు ప్రాంతాలకు పంపారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. నిజానికి ఢిల్లీలో భిక్షాటన నేరం కాదు. భిక్షాటనను నేరంగా పరిగణించే చట్టాన్ని ఢిల్లీ హైకోర్టు 2019లో రద్దు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ పోలీసులు ఫుట్‌పాత్‌పై భిక్షాటన చేస్తూ నిద్రిస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఢిల్లీ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు
జి-20 సదస్సు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి హోటల్, రాయబార కార్యాలయం న్యూఢిల్లీ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి G-20 ప్రతినిధులు కూడా ఈ ప్రాంతంలో ఉంటారు. న్యూఢిల్లీ ప్రాంతంలోని యాచకులు, నపుంసకులు, మాదకద్రవ్యాలకు బానిసలు, ఫుట్‌పాత్‌లపై నిద్రించే వ్యక్తులందరినీ ఢిల్లీ పోలీసులు చూసుకుంటారు. వారి బస, భోజన, పానీయాల ఏర్పాట్లు కూడా పోలీసులు చేపట్టారు.