First Private Rocket: నింగిలోకి దూసుకెళ్లిన తొలి ప్రైవేటు రాకెట్!
దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. షార్‌లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి తొలి ప్రైవేటు రాకెట్
- By Balu J Published Date - 02:48 PM, Fri - 18 November 22

దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఉదయం 11.30 గంటలకు షార్‌లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి తొలి ప్రైవేటు రాకెట్ నింగిలోకి వెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ.. విక్రమ్ – సబార్బిటల్ (వీకేఎస్) ఈ ప్రైవేట్ రాకెట్‌ను అభివృద్ధి చేసింది. ఈ మొట్టమొదటి మిషన్‌కు ‘ప్రారంభ్’ అని నామకరణం చేశారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ హాజరయ్యారు. ఈ నెల 12నే ప్రయోగం చేపట్టాల్సి ఉండగా వాతావరణం అనుకూలించక పోవడంతో నేటికి వాయిదా పడింది.
♦శ్రీహరికోట: . దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
♦ఉదయం 11.30 గంటలకు షార్‌లోని సౌండింగ్ రాకెట్ కాంప్లెక్స్ నుంచి తొలి ప్రైవేటు రాకెట్ నింగిలోకి వెళ్లింది.
♦ఈ ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.#VikramS @isro @SkyrootA pic.twitter.com/K4zwIjhP3i— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 18, 2022