Kejriwal : మాజీ సీఎం కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు
ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు న్యాయస్థానానికి నివేదికను సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోందని, మరింత సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు.
- By Latha Suma Published Date - 01:00 PM, Fri - 28 March 25

Kejriwal : ఢిల్లీ పోలీసులు ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు నమోదు చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేయాలని ఇటీవల ఢిల్లీ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు న్యాయస్థానానికి నివేదికను సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోందని, మరింత సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు.
Read Also: Nitish Kumar Reddy: హెల్మెట్ విసిరేసిన సన్‌రైజర్స్ ఆటగాడు నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
దీంతో తదుపరి విచారణను ఏప్రిల్ 18కి కోర్టు వాయిదా వేసింది. కాగా, ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ సహా ఇతరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ఆ అభ్యర్థనను ఢిల్లీ కోర్టు అంగీకరించింది. 156(3) Cr.PC సెక్షన్ కింద దర్యాప్తుకు కోర్టు అనుమతి ఇచ్చింది. 2019లో ద్వారకలో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటుచేయడానికి ప్రజానిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ రౌజ్‌అవెన్యూ కోర్టు లో పిటిషన్ దాఖలైంది.
ఢిల్లీ ప్రివెన్షన్ ఆఫ్ డెఫేస్‌మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, 2007లోని సెక్షన్ 3 ప్రకారం కేసులు నమోదు చేయాలని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నేహా మిట్టల్ తన తీర్పులో పేర్కొన్నారు. 2019లో అప్పటి మటియాలా ఎమ్మెల్యే గులాబ్ సింగ్ (ఆప్), ద్వారక ఏ వార్డు మాజీ కౌన్సిలర్ నితికా శర్మ రాజధానిలో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై అప్పటినుంచి ఫిర్యాదులు రావడంతో, కోర్టు తాజా నిర్ణయం తీసుకుంది.
Read Also: UP : రోడ్లపై నమాజ్ చేస్తే పాస్‌పోర్ట్, లైసెన్స్ రద్దు: యూపీ పోలీసులు