Father hires killers: కర్ణాటకలో దారుణం.. కిల్లర్స్‌తో కన్న కొడుకును హత్య చేయించిన తండ్రి
- By Gopichand Published Date - 06:32 AM, Fri - 9 December 22

కర్ణాటకలోని హుబ్లీలో దారుణం జరిగింది. ఓ తండ్రి కాంట్రాక్ట్ కిల్లర్స్‌కు సుపారీ (Father hires killers) ఇచ్చి కుమారుడ్ని హత్య చేయించాడు. వ్యక్తిగత కారణాలతో భరత్ మహాజన్‌శెట్టి అనే వ్యాపారి తన కొడుకు అఖిల్‌ను మర్డర్ (Murder) చేయించాడు. అనంతరం తన కుమారుడు కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మహాజన్‌శెట్టి తీరుపై అనుమానం కలిగి పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కర్నాటకలోని హుబ్లీ పోలీసులు మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడు తన సొంత కొడుకును చంపడానికి ఆరుగురిని కిరాయి(Father hires killers)కి తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. బాధితురాలి తండ్రి సహా ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. 26 ఏళ్ల అఖిల్ జ్యుయలరీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే తన కుమారుడు అదృశ్యమయ్యాడంటూ అఖిల్ తండ్రి భరత్ మహాజన్‌శెట్టి ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని రోజుల తర్వాత తన కుమారుడు ఫోన్ చేశాడని, ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడంటూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తండ్రి తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ కుటుంబ సభ్యులందరినీ ప్రశ్నించారు. కొన్ని ఆధారాలు లభించిన తర్వాత తండ్రి భరత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
Also Read: Hyderabad: కోరిక తీరుస్తావా ఫోటోలు పోస్ట్ చేయాలా అంటూ.. ప్రముఖ టీవీ యాంకర్ కు బెదిరింపులు?
వ్యక్తిగత కారణాల వల్ల కాంట్రాక్ట్ కిల్లర్స్‌కు సుపారీ ఇచ్చి కుమారుడ్ని హత్య చేయించినట్లు తండ్రి ఒప్పుకున్నాడు. ఈ నెల 1న కుమారుడు అఖిల్‌ను తానే స్వయంగా ఆరుగురు కిల్లర్స్‌కు అప్పగించి ఒంటరిగా ఇంటికి తిరిగి వెళ్లినట్లు తెలిపాడు. కిల్లర్లు అతడ్ని హత్య చేసి దేవికొప్పలోని చెరకు పొలాల వద్ద మృతదేహాన్ని పాతిపెట్టినట్లు చెప్పాడు.పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.