HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Farmers Delhi Chalo March Paused For 2 Day

Delhi Chalo : పోలీసులతో ఘర్షణ ..‘ఛలో ఢిల్లీ’కి రెండు రోజులు బ్రేక్

  • Author : Latha Suma Date : 22-02-2024 - 10:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Farmers' 'delhi Chalo' March Paused For 2 Day
Farmers' 'delhi Chalo' March Paused For 2 Day

 

 

Farmers Protest : పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీతో పాటు పలు డిమాండ్లతో దేశ రాజధాని దిశగా కదంతొక్కిన రైతులు రెండు రోజులపాటు ‘ఛలో ఢిల్లీ’( Delhi Chalo) మార్చ్‌ను వాయిదా వేసుకున్నారు. పంజాబ్-హర్యానా సరిహద్దులో పోలీసులతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి కార్యాచరణను శుక్రవారం(ఫిబ్రవరి 23) సాయంత్రం వెల్లడిస్తామని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ బుధవారం ప్రకటించారు. రైతులు-హర్యానా పోలీసుల మధ్య జరిగిన ఘర్షణపై ఆయన మీడియాతో మాట్లాడారు.

ఖనౌరీ-శంభు సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై హర్యానా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, దీనిని ఖండిస్తున్నామని అన్నారు. చాలా మంది రైతులు గాయపడ్డారని, చాలా మంది కనిపించడం లేదని పందేర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని రాబోయే రెండు రోజుల పాటు ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని, ఈ రెండు రోజుల విరామంలో గాయపడిన, కనిపించకుండా పోయిన రైతుల కుటుంబాలను కలుస్తామని వెల్లడించారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత హామీ విషయంలో ప్రభుత్వం పారిపోతోందని అన్నారు. రైతులు రహదారిని దిగ్బంధించలేదని, ప్రభుత్వమే ఆ పని చేసిందని ఆయన అన్నారు. శాంతియుతంగా ముందుకు వెళ్తామని చెబుతూనే ఉన్నామని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, బుధవారం రైతులు-హర్యానా పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువ రైతు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ మరో ఇద్దరు రైతుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పాటియాలాలోని రజింద్ర హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ రేఖీ వెల్లడించారు. ఇక హర్యానా పోలీసు అధికారి మనీషా చౌదరి స్పందించారు. దాటా సింగ్-ఖానౌరీ సరిహద్దులో రైతు నిరసనకారులు పోలీసు సిబ్బందిని చుట్టుముట్టారని తెలిపారు. పోలీసులను అడ్డుకునేందుకు పంట వ్యర్థాలను తగలబెట్టి మంటల్లో కారం పోశారని, పోలీసులపైకి రాళ్లు రువ్వారని తెలిపారు. కర్రలతో పోలీసులపై దాడి చేశారని, ఈ ఘటనలో 12 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు.

read also : Kannappa: ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ.. పార్వతిగా కనిపించనున్న ఫైర్ బ్రాండ్.. ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chalo Delhi
  • delhi
  • farmers protest
  • haryana
  • punjab

Related News

Lakhpati Bitiya Yojana

లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

పాఠశాల విద్య సమయంలో సదరు బాలిక ఢిల్లీ ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో చదవడం తప్పనిసరి.

  • IND vs NAM

    టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో విజ‌య యాత్ర కొనసాగిస్తున్న భార‌త్ జ‌ట్టు!

  • Bharat Bandh

    నేడు భారత్ బంద్..

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd