Ex-MLA Arjun Das: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి
ఒడిశాలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అర్జున్ చరణ్ దాస్ (Ex-MLA Arjun Das) రోడ్డు ప్రమాదంలో మరణించారు. జాజ్‌పూర్ జిల్లాలో ఆయన బైక్‌ను ట్రక్కు ఢీకొనడంతో శనివారం ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
- Author : Gopichand
Date : 05-02-2023 - 9:27 IST
Published By : Hashtagu Telugu Desk
ఒడిశాలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అర్జున్ చరణ్ దాస్ (Ex-MLA Arjun Das) రోడ్డు ప్రమాదంలో మరణించారు. జాజ్‌పూర్ జిల్లాలో ఆయన బైక్‌ను ట్రక్కు ఢీకొనడంతో శనివారం ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన గురించి సదర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి మానస్ రంజన్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో మాజీ ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో పాల్గొనడానికి రాజధానికి వెళ్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యేతోపాటు బైక్‌పై వెళ్తున్న మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితిని చూసిన వైద్యులు కటక్ SCB మెడికల్ కాలేజీ & హాస్పిటల్‌కు రిఫర్ చేశారు.
Also Read: Bomb Blast In Bengal: పశ్చిమ బెంగాల్‌లో బాంబు పేలుడు.. టిఎంసి కార్యకర్త దుర్మరణం
మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితిలో చేరారు. దాస్ మృతి వార్త పట్ల సీఎం కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఒడిశా వ్యవస్థాపక సభ్యుడు అక్షయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. దాస్ సంవాదత సమ్మేళన్‌లో పాల్గొనేందుకు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అర్జున్ చరణ్ దాస్ 1955 నుండి 200 వరకు జాజ్‌పూర్‌లోని బింజర్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అర్జున్ దాస్ జాజ్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎంపీ అనాది దాస్ కుమారుడు. అనాది దాస్ 1971, 184లో భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా ఎన్నికయ్యారు.