Ex-CM Jagadish Shettar: కర్ణాటకలో బీజేపీకి షాక్.. రాజీనామా చేసిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్
టికెట్ రాకపోవడానికి గల కారణాలేమిటో తనకు తెలియదని టికెట్ పై ఆగ్రహంతో ఉన్న కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ (Ex-CM Jagadish Shettar) ఆదివారం అన్నారు.
- By Gopichand Published Date - 01:48 PM, Sun - 16 April 23

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మరోవైపు టిక్కెట్ల పంపిణీ తర్వాత బీజేపీకి రెబల్ ఎమ్మెల్యేలు పెద్ద సవాల్‌గా మారారు. ఇదిలావుండగా.. టికెట్ రాకపోవడానికి గల కారణాలేమిటో తనకు తెలియదని టికెట్ పై ఆగ్రహంతో ఉన్న కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ (Ex-CM Jagadish Shettar) ఆదివారం అన్నారు. ఏఎన్‌ఐతో మాట్లాడిన జగదీశ్ శెట్టర్.. నేను పార్టీలో సీనియర్‌ని, నాకు టిక్కెట్టు నిరాకరించారు. కారణాలేమిటో నాకు తెలియదు. నాకు మంత్రివర్గం వద్దు. ఎమ్మెల్యేగా పని చేస్తాను. నియోజకవర్గానికి సేవ చేస్తా.. నాకు టిక్కెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటో కూడా నాకు తెలియదని ఆయన అన్నారు.
మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ నిరాకరించడంతో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ ఆదివారం ప్రకటించారు. పార్టీతో పాటు అసెంబ్లీకి కూడా రాజీనామా చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న శెట్టర్ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు.
#WATCH | BJP leader & Former Karnataka CM Jagadish Shettar tenders his resignation as an MLA to Karnataka Assembly Speaker, Vishweshwar Hegde Kageri, at Sirsi. pic.twitter.com/v0RNQcdj6C
— ANI (@ANI) April 16, 2023
మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాషాయ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తనకు టికెట్ ఇవ్వలేదనే విషయాన్ని చివరి వరకు దాచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డేను కలిసి తన రాజీనామా లేఖ సమర్పించారు. బీజేపీని వీడిన శెట్టర్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ పలువురు సీనియర్లను పక్కనబెట్టింది. 52 మందిని కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌తో పాటు మంత్రి అంగారాకు కూడా టికెట్ నిరాకరించింది.
బిజెపి అభ్యర్థుల జాబితా నుండి తొలగించబడిన తరువాత శెట్టర్ తనకు ఇష్టమైన నియోజకవర్గం నుండి టిక్కెట్ ఇవ్వకపోతే తన రాజకీయ భవిష్యత్తును ఆలోచిస్తానని పేర్కొంటూ పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. అయితే ఆ తర్వాత ఆయన తన అల్టిమేటంను శనివారం సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. మే 10న ఒకే దశలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.