Encounter : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి
ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు సహా నక్సల్స్ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- Author : Latha Suma
Date : 29-08-2024 - 4:56 IST
Published By : Hashtagu Telugu Desk
Encounter: ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని మార్హ్‌లో భద్రతా బలగాలు-నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు సహా నక్సల్స్ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని మార్హ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. మావోయిస్టుల కోసం డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, బీఎస్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉదయం నుంచి ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని ఐజీ బస్తర్ పి. సుందర్‌రాజ్ తెలిపారు. ఇంకా కాల్పులు జరుగుతున్నాయని.. సైనికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, సేఫ్ గా ఉన్నట్లు ఆయన చెప్పారు.
కాగా, 2026 మార్చినాటికి నక్సల్ హింస నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 25న ప్రకటించిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో యాంటీ నక్సల్ ఆపరేషన్స్‌పై జరిగిన సమావేశం అనంతరం మాట్లాడుతూ.. వామపక్ష తీవ్రవాదంపై అంతిమ దాడికి సమయం వచ్చిందని చెప్పారు. మన దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థకు అతి పెద్ద సవాల్ నక్సలిజమని తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ సవాల్‌ను స్వీకరించిందని, ఆయుధాలు పట్టినవారిని ప్రధాన జీవన స్రవంతిలోకి తేవడానికి ప్రయత్నించిందని చెప్పారు. నక్సలిజం వల్ల గత నాలుగు దశాబ్దాల్లో 17,000 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. నక్సల్ నేతలను మట్టుబెట్టామని తెలిపారు.
Read Also: Mukesh Ambani : జామ్‌నగర్ ప్రపంచ ఇంధన రాజధానిగా మారనుంది