Elections 2024: రేపే మొదటి దశ పోలింగ్.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించింది..?
2024 లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ రేపు, శుక్రవారం (ఏప్రిల్ 19) జరగనుంది. దీని ఎన్నికల ప్రచారం బుధవారం (ఏప్రిల్ 17)తో ముగిసింది.
- By Gopichand Published Date - 11:00 AM, Thu - 18 April 24

Elections 2024: 2024 లోక్‌సభ ఎన్నికల (Elections 2024)కు మొదటి దశ ఓటింగ్ రేపు, శుక్రవారం (ఏప్రిల్ 19) జరగనుంది. దీని ఎన్నికల ప్రచారం బుధవారం (ఏప్రిల్ 17)తో ముగిసింది. ఈ దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ నిర్వహించబడుతుంది. ఓటర్లు ఈవీఎం యంత్రాలలో అభ్యర్థుల భవితవ్యాన్ని డిసైడ్ చేయనున్నారు. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. ఏప్రిల్ 19న జరగనున్న లోక్‌సభ ఎన్నికల మొదటి దశ ఎన్నికల బరిలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజెపి), ఎన్‌డిఎ అభ్యర్థులందరికీ ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం లేఖ రాశారు. రామ నవమి సందర్భంగా మొదటి దశ ఓటింగ్‌కు కేవలం రెండు రోజుల ముంద ప్రధాని మోడీ కూడా అభ్యర్థులను వ్యక్తిగతంగా సంప్రదించారు.
2019 ఎన్నికల్లో ఈ సీట్లపై ఏ పార్టీ జెండా ఎగురవేసింది?
తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, ఉత్తరాఖండ్‌లోని 5, అరుణాచల్‌ప్రదేశ్‌లోని 2, మేఘాలయలో 2, అండమాన్ నికోబార్‌లో 1, మిజోరాంలో 1, పుదుచ్చేరిలో 1, సిక్కింలోని 1 స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. లక్షద్వీప్‌లోని 1 సీటుకు కూడా ఓటింగ్ జరగనుంది. ఇది కాకుండా రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అస్సాం, మహారాష్ట్రల్లో 5, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్‌లో 3, జమ్మూ-కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, త్రిపురలో ఒక్కో సీటు ఉన్నాయి.
Also Read: EVM Malfunction : ఈవీఎంలో తప్పుడు బటన్ నొక్కితే.. ? అకస్మాత్తుగా ఈవీఎం మొరాయిస్తే.. ఎలా ?
గత లోక్‌సభ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే.. ఈ 102 స్థానాల్లో యూపీఏ 45, ఎన్డీయే 41 స్థానాలు గెలుచుకున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ 65 స్థానాల్లో, బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేయగా, డీఎంకే 24 స్థానాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో 8 మంది కేంద్ర మంత్రులతో సహా పలువురు ప్రముఖుల భవితవ్యం తేలనుంది. 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. మొదటి దశలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, సర్బానంద సోనోవాల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, బిప్లబ్ దేబ్, నబమ్ టుకీ, సంజీవ్ బల్యాన్, ఎ రాజా, ఎల్ మురుగన్, కార్తీ చిదంబరం, టి దేవనాథ్ యాదవ్ ఉన్నారు.
We’re now on WhatsApp : Click to Join