Delhi: ఢిల్లీకి ముందస్తు ఎన్నికలపై ఈసీ సమాధానం..!
EC's answer on early elections to Delhi..!: మహారాష్ట్రతో పాటు ఢిల్లీలోనూ ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఆప్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని సంబంధిత వర్గాల సమాచారం.
- By Latha Suma Published Date - 03:36 PM, Mon - 16 September 24

EC’s answer on early elections to Delhi..!:సీఎం కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనతో ఢిల్లీ రాజకీయాల్లో ఒక్కసారిగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రతో పాటు ఢిల్లీలోనూ ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ఆప్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని సంబంధిత వర్గాల సమాచారం.
Read Also: Team India Superstar: గిల్ కి జై కొట్టిన ట్రావిస్ హెడ్
కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనతో తదుపరి సీఎం ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే.. దీనిపై ఆప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈనేపథ్యంలోనే ముందస్తు ఎన్నికలపై స్పందించిన ఆప్ కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి సీఎం ఎవరనే ప్రశ్నకు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. సీఎం కేజ్రీవాల్ రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందించనున్నారని.. అది ఆమోదం పొందిన వెంటనే తదుపరి సీఎం ఎవరనే అంశంపై చర్చిస్తాం. పార్టీ ఎమ్మెల్యేలంతా కలిసి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తామన్నారు.
‘ప్రజలకు ఆప్‌పై నమ్మకం ఉంది. వారు మమ్మల్ని మరోసారి స్వాగతిస్తారు. అభ్యర్థి ఎవరనేది తెలియడానికి కాస్త సమయం పడుతుంది. వారం రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తాం. బంతి ఇంకా బీజేపీ కోర్టులోనే ఉంది. కేజ్రీవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటే ముందస్తు ఎన్నికలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి” అంటూ సౌరభ్ భరద్వాజ్ సవాల్ విసిరారు. కేజ్రీవాల్ పరువు తీసేందుకు కేంద్రంలోని బీజేపీ ఎన్నో విధాలుగా ప్రయత్నించిందని.. అయినప్పటికీ ఆయన నిజాయతీపై ప్రజలకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ముందస్తు ఎన్నికలపై ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆప్‌కి షాక్ తగిలినట్లయింది.
Read Also: Devara : ‘దేవర’ కొత్త పోస్టర్ రిలీజ్.. బాక్సాఫీస్ ఆయుధ పూజ అంటూ..
ఇటీవల సుప్రీం కోర్టు బెయిల్ మంజూరుచేయడంతో సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. బయటకొచ్చిన కొన్ని గంటల్లోనే సీఎం పదవికి రాజీనామా చేస్తానని.. ఎన్నికలు జరిగేంతవరకు వేరొకరు ఆ బాధ్యతలు చేపడతారని ఆయన ప్రకటించడంతో ఒక్కసారిగా యావత్ దేశ దృష్టి ఢిల్లీ రాజకీయాలపై పడింది. తాత్కాలిక సీఎం ఎవరనే అంశంపై ఆప్ నేతలు చర్చలకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం కేజ్రీవాల్‌తో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా భేటీ కానున్నారు.