HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Delhi Cm Who Went To Meet Wangchuk Was Stopped By The Police

Delhi: వాంగ్‌చుక్‌ను కలిసేందుకు వెళ్లిన ఢిల్లీ సీఎం..అడ్డుకున్న పోలీసులు..

Delhi: సింగు సరిహద్దులో ఢిల్లీ పోలీసులు వాంగ్‌చుక్‌తో సహా 120 మంది మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని వాంగ్‌చుక్‌ స్వయంగా ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ఆయనను కలిసేందుకు సీఎం ఆతిశీ బవానా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా.. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.

  • Author : Latha Suma Date : 01-10-2024 - 5:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Delhi CM who went to meet Wangchuk was stopped by the police.
Delhi CM who went to meet Wangchuk was stopped by the police.

Sonam Wangchuk : పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ , ఆయన మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే నిర్బంధంలో ఉన్న ఆయనను కలిసేందుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. వాంగ్‌చుక్‌ ప్రారంభించిన యాత్ర లద్దాఖ్‌ నుంచి ఢిల్లీకి చేరుకునే క్రమంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. సింగు సరిహద్దులో ఢిల్లీ పోలీసులు వాంగ్‌చుక్‌తో సహా 120 మంది మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని వాంగ్‌చుక్‌ స్వయంగా ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ఆయనను కలిసేందుకు సీఎం ఆతిశీ బవానా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా.. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.

Read Also: CM Chandrababu : వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన: సీఎం చంద్రబాబు

కాగా.. సోనమ్‌ వాంగ్‌చుక్‌, ఇతర మద్దతుదారులు తమ డిమాండ్‌లను నెరవేర్చాలని గత నెల 1న లేహ్‌లో పాదయాత్ర ప్రారంభించారు. హిమాచల్‌ ప్రదేశ్‌కు వారి పాదయాత్ర చేరుకున్నాక వాంగ్‌చుక్‌ తమ పాదయాత్ర ఉద్దేశాన్ని వెల్లడించారు. ఐదేళ్ల క్రితం కేంద్రం తమకిచ్చిన వాగ్దానాన్ని గుర్తుచేసేందుకు ఈ పాదయాత్ర చేపట్టామన్నారు. ఇక, వారి డిమాండ్‌లలో ప్రధానమైనది లద్దాఖ్‌ను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చడం. ఇది స్థానిక జనాభా, వారి భూమి, సాంస్కృతిక గుర్తింపును రక్షించేందుకు చట్టాన్ని రూపొందించే అధికారాన్ని ఇస్తుంది.

Read Also: Tirumala Laddu Issue : చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేయాల్సింది కాదు – పురందీశ్వరి

వాంగ్‌చుక్‌ను అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్యావరణ, రాజ్యాంగ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌తో పాటు వందల మంది లద్దాఖీలను నిర్బంధించడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ క్రమంలోనే ఆయనను కలిసేందుకు వెళ్లిన ఆతిశీని అడ్డుకున్నారు.

కాగా, ” ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు సోనమ్‌ వాంగ్‌చుక్‌ను అదుపులోకి తీసుకున్న బవానా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ సీఎంను పోలీసు అధికారులు అడ్డుకున్నారు” అని ఆప్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఢిల్లీ-హర్యానా సరిహద్దులో ఉన్న బవానా పోలీస్ స్టేషన్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదుపులోకి తీసుకున్న వాంచుక్ మద్దతుదారులను ఢిల్లీ సరిహద్దుల్లోని ఇతర పోలీస్ స్టేషన్లలో ఉంచారు.

Read Also: International Coffee Day : మీకు కాఫీ ప్రేమకులైతే ఖచ్చితంగా భారతదేశంలోని ఈ 5 ప్రదేశాలను సందర్శించండి..!

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aam aadmi party
  • CM Atishi Marlena
  • delhi
  • police Stopped
  • Sonam Wangchuk

Related News

Meeting Of CMs

India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

ఈ సదస్సు ద్వారా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో ఉన్న అనుకూలతలు, వనరులు మరియు రాయితీలను పారిశ్రామికవేత్తల ముందు ఉంచుతున్నారు

  • Bill Gates 

    ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

  • Lakhpati Bitiya Yojana

    లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

Latest News

  • Trump Warning : ట్రంప్ వార్నింగ్ తో మార్కెట్ షేక్.. $100 దిశగా ఆయిల్ ధరలు?

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd