Delhi assembly elections : ఒంటిగంట వరకు 33.31శాతం పోలింగ్
మధ్యాహ్నం ఒంటి గంట వరకు 33.31 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో కంటే నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్‌లో అత్యధికంగా 39.51 శాతం పోలింగ్ నమోదైంది.
- By Latha Suma Published Date - 03:14 PM, Wed - 5 February 25

Delhi assembly elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 33.31 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో కంటే నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్‌లో అత్యధికంగా 39.51 శాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీ సెంట్రల్ జిల్లాలో అత్యల్పంగా 29.74 శాతం పోలింగ్ నమోదైంది.
ఇక, సౌత్ వెస్ట్ జిల్లాలో 35.44 శాతం, న్యూఢిల్లీలో 29.89 శాతం, ఈస్ట్ 33.66 శాతం, నార్త్ 32.44 శాతం, న్యూఢిల్లీ 29.89 శాతం, ఈస్ట్ 33.36 శాతం, నార్త్ 32.44 శాతం, నార్త్ వెస్ట్ 33.17 శాతం, షహదర 35.81 శాతం, సౌత్ 32.67 శాతం, సౌత్ ఈస్ట్ 32.27 శాతం, వెస్ట్ 30.89 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగనుంది. పోలింగ్ పూర్తయిన వెంటనే ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
Read Also: Visakha Railway Zone : విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ : ఉత్తర్వులు జారీ
ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులోని ఈరోడ్(ఈస్ట్), ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో 42.41 శాతం, 44.59 శాతం పోలింగ్ నమోదైంది. ఈరోడ్ ఈస్ట్ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇళంగోవన్ మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయోధ్య జిల్లాలోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికను సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈనెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి భవితవ్యాన్ని తేల్చేందుకు మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13,766 పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓట్లు వేస్తున్నారు.