Celebrities Voting : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు వీరే
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి ఎస్టేట్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు(Celebrities Voting) వేశారు.
- By Pasha Published Date - 10:32 AM, Wed - 5 February 25

Celebrities Voting : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. తొలి గంటల్లోనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు వేశారు. 1.56 కోట్ల మందికిపైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నిక జరుగుతోంది. అన్ని స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి.
President Droupadi Murmu casts her vote at Dr Rajendra Prasad Kendriya Vidyalaya at the Rashtrapati Bhavan, New Delhi #DelhiAssemblyElection2025 #DelhiElections2025 #polls #DroupadiMurmu #HashtagU @ECISVEEP pic.twitter.com/aJs0x68i1C
— Hashtag U (@HashtaguIn) February 5, 2025
Also Read :Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలతో దుమారం.. టీపీసీసీ సీరియస్
ఓటు వేసిన ప్రముఖులు వీరే
- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి ఎస్టేట్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు(Celebrities Voting) వేశారు.
- కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్మాణ్ భవన్‌లో ఓటు వేశారు.
- భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, ఆయన సతీమణి తుగ్లక్ క్రెసెంట్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
- కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి, ఆయన సతీమణి లక్ష్మీ పురి, ఇతర కుటుంబసభ్యులు ఆనంద్ నికేతన్‌లో ఓటు వేశారు.
- దివంగత బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ కుమార్తె, బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ జన్‌పథ్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటువేశారు.
- భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠీ కె.కమ్రాజ్ లేన్‌లో ఓటు వేశారు.
- ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా, తన సతీమణి సీమాతో కలిసి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటువేశారు.
- స్వాతి మలివాల్ ఓటు వేశారు.
- ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా రాజ్ నివాస్ మార్గ్‌లో, సీఎం ఆతిషి కాల్‌కాజీలో ఓటు వేశారు.
- చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఓటు వేశారు.
#DelhiAssemblyElections : Lok Sabha LoP and Congress leader #RahulGandhi casts vote at a polling booth. #Delhi #DelhiElections2025 #DelhiElection #polls #HashtagU pic.twitter.com/A2uLil6FGc
— Hashtag U (@HashtaguIn) February 5, 2025
Also Read :Pawan Kalyan : ఈరోజు నుంచి పవన్ కల్యాణ్ దక్షిణాది టూర్.. వివరాలివీ
ఓటు వేశాక.. సీఎం అతిషి కీలక వ్యాఖ్యలు
ఓటు వేసిన అనంతరం సీఎం అతిషి విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇవి కేవలం ఎన్నికలు మాత్రమే కావు. ఇవి ఒక ధర్మ యుద్ధం’’ అని ఆమె తెలిపారు. ‘‘మంచి, చెడుకు మధ్య జరుగుతున్న ఈ ధర్మ యుద్ధంలో ఒక వైపున ఢిల్లీ పురోగతిని కోరుకునే విద్యావంతులు ఉన్నారు. మరోవైపు గూండాయిజం చలాయించే వ్యక్తులు ఉన్నారు. ఏ వైపు నిలవాలనేది ప్రజల ఇష్టం. ప్రజలు పనిచేసే వాళ్లకే ఓటు వేస్తారనేది నా నమ్మకం. ఢిల్లీ పోలీసులు బహిరంగంగానే బీజేపీ కోసం పనిచేస్తున్నారు’’ అని అతిషి కీలక వ్యాఖ్యలు చేశారు.
Chief Election Commissioner Rajiv Kumar cast his vote for the Delhi Assembly Elections 2025 #DelhiAssemblyElections #DelhiElections2025 #Elections #ElectionCommissioner #RajivKumar #HashtagU pic.twitter.com/SP84xRNZgo
— Hashtag U (@HashtaguIn) February 5, 2025