Chhattisgarh Assembly Elections : ఛత్తీస్‌గఢ్ ఎన్నికల వేళ.. సుక్మాలో పేలిన ఐఇడి బాంబు
ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో ఈ ఐఈడీ బాంబు పేల్చి విధ్వసం సృష్టించారు. కాంకేర్ జిల్లాలోని మార్బెడ నుంచి రెంగాఘటి రెంగగొండి పోలింగ్ స్టేషన్‌కు ఎన్నికల సిబ్బంది, భద్రతా బలగాలు వెళ్తుండగా ఈ బాంబు పేలుడు సంభవించింది
- Author : Sudheer
Date : 07-11-2023 - 11:04 IST
Published By : Hashtagu Telugu Desk
మరికొద్ది గంటల్లో ఛత్తీస్‌గఢ్ ఎన్నికల పోలింగ్ (Chhattisgarh Assembly Elections Polling) మొదలుకాబోతుందనుకున్న సమయంలో సుక్మా (Sukma )లో మావోలు రెచ్చిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో ఈ ఐఈడీ బాంబు పేల్చి విధ్వసం సృష్టించారు. కాంకేర్ జిల్లాలోని మార్బెడ నుంచి రెంగాఘటి రెంగగొండి పోలింగ్ స్టేషన్‌కు ఎన్నికల సిబ్బంది, భద్రతా బలగాలు వెళ్తుండగా ఈ బాంబు పేలుడు IED (Improvised Explosive Device) ) సంభవించింది. ఈ ఘటనలో ఒక బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ (Central Reserve Police Force (CRPF) ), ఇద్దరు పోలింగ్ టీమ్ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను ప్రకాష్ చంద్‌గా గుర్తించారు. అతన్ని మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మరో ఇద్దరు సిబ్బందికి కూడా చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారు ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెల్లడించారు. పోలింగ్‌ను బహిష్కరించాలని మావోయిస్టులు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఇప్పటికే పలుచోట్ల మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ప్రస్తుతం కోబ్రా టీమ్ లోని 206 బెటాలియన్ సిబ్బంది, సిఆర్‌పిఎఫ్ జవాన్లు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, మిజోరం (Chhattisgarh , Mizoram elections) రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు.. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. వీటిలో సమస్యాత్మక అంతగఢ్, భానుప్రతాపుర్, కంకేర్, కేష్‌కల్, కొండగావ్, నారాయణపుర్, దంతెవాడ, బీజాపూర్, కొంటా స్థానాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. మరోవైపు మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ జరుగుతుంది.
ఇక మిజోరం లో మొత్తం 40 స్థానాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. 174 మంది అభ్యర్థుల ఈ ఎన్నికల్లో తమ లక్ పరీక్షించుకుంటుండగా.. 8 లక్షలకు పైగా ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో పోలింగ్‌కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు చేపట్టింది.
Read Also : Polling Updates : అక్కడ 23 ఏళ్ల తర్వాత పోలింగ్.. కళ్లు లేకున్నా ఓటు కోసం నడిచొచ్చాడు