Congress-Uniform Civil Code : యూసీసీపై కాంగ్రెస్ వైఖరి చెప్పేది అప్పుడేనట !?
Congress-Uniform Civil Code : యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అంశంపై చర్చించేందుకు పార్టీ ముఖ్య నేతలతో కాంగ్రెస్ న్యూఢిల్లీలో ఆంతరంగిక సమావేశం నిర్వహించింది.
- By Pasha Published Date - 05:26 PM, Sat - 15 July 23

Congress-Uniform Civil Code : యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అంశంపై చర్చించేందుకు పార్టీ ముఖ్య నేతలతో కాంగ్రెస్ న్యూఢిల్లీలో ఆంతరంగిక సమావేశం నిర్వహించింది. ఇందులో హస్తం పార్టీ సీనియర్ నేతలు పి.చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్, వివేక్ తన్‌ఖా, కేటీఎస్ తులసి, మనీశ్ తివారీ, ఎల్ హనుమంతయ్య, అభిషేక్ మను సింఘ్వి పాల్గొన్నారు. అయితే ఈ మీటింగ్ ముగిసిన అనంతరం వెళ్లిపోయే క్రమంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేటీఎస్ తులసి మీడియాతో మాట్లాడారు. యూసీసీపై(Congress-Uniform Civil Code) ఈ సమావేశంలో ఏమీ తేల్చలేదని ఆయన స్పష్టం చేశారు.
Also read : Thipatcha Putthawong: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు
కేంద్ర ప్రభుత్వం యూసీసీ డ్రాఫ్ట్ బిల్లును విడుదల చేసిన తర్వాత.. దాన్ని స్టడీ చేసి తమ పార్టీ వైఖరిని ప్రకటిస్తామని తెలిపారు. కాంగ్రెస్ నేత మనీష్ తివారీ బీజేపీపై విరుచుకుపడ్డారు. “ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో దేశ ప్రజల మధ్య చీలికను సృష్టించేందుకే యూనిఫాం సివిల్ కోడ్ ను కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది” అని తివారీ విమర్శించారు. మరోవైపు ప్రతిపాదిత యూసీసీని శిరోమణి అకాలీ దళ్ వ్యతిరేకించింది. ఇది దేశ ప్రయోజనాలకు తగినది కాదని పేర్కొంటూ లా కమిషన్‌కు లేఖ రాసింది.
Also read : CBN Turning Point : చంద్రబాబు`మలుపు`కు 3డేస్