CBN Turning Point : చంద్రబాబు`మలుపు`కు 3డేస్
బీజేపీ, టీడీపీ మధ్య దోబూచులాటకు (CBN Turning Point)క్లారిటీ రానుంది. ఈనెల 18న ఢిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది.
- Author : CS Rao
Date : 15-07-2023 - 4:01 IST
Published By : Hashtagu Telugu Desk
మూడే మూడు రోజుల్లో బీజేపీ, టీడీపీ మధ్య దోబూచులాటకు (CBN Turning Point)క్లారిటీ రానుంది. ఈనెల 18వ తేదీన ఢిల్లీలో జరిగే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. ఆ సమావేశానికి హాజరు కావాలని జనసేనకు ఆహ్వానం లభించింది. కానీ, టీడీపీకి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్విటేషన్ లేదు. సరిగ్గా ఇక్కడే, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీ పొత్తు ఉంటుందా? ఉండదా? అనేది తేలనుంది. ఒక వేళ ఎన్డీయే పక్షాల సమావేశానికి టీడీపీ హాజరు కాకుండా ఉంటే, పొత్తు లేనట్టు భావించడానికి అవకాశం ఉంది. జనసేనాని పవన్ మాత్రం బీజేపీని కలుపుకుని టీడీపీతో కలిసి వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఆ విషయాన్ని పరోక్షంగా ఇప్పటికే పలుమార్లు ఆయన చెప్పారు.
మూడు రోజుల్లో బీజేపీ, టీడీపీ మధ్య దోబూచులాటకు క్లారిటీ(CBN Turning Point)
ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూడాలని (CBN Turning Point) పవన్ తపన. కానీ, బీజేపీ మాత్రం జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా చూడాలని కోరుకుంటోంది. ఆ మేరకు పాజిటివ్ సంకేతాలను ఇటీవల చాలా ఇచ్చింది. బీజేపీ ఢిల్లీ పెద్దలతో విడదీయరాని బంధాన్ని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. అందుకే, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులోని నిందితుడు, ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ సాధ్యంకాలేదని సర్వత్రా తెలిసిందే. ఇక సంక్షేమ పథకాలకు అవసరమైన డబ్బును అందచేయడానికి కేంద్రం ముందుకొచ్చింది. వివిధ మార్గాల ద్వారా కేంద్రం నుంచి నిధులను జగన్ సమకూర్చుకుంటున్నారు. అందుకు ప్రతిఫలంగా ఎన్డీయే ప్రవేశపెట్టే బిల్లులకు పార్లమెంట్ వేదికగా వైసీపీ సంపూర్ణ మద్ధతు ఇస్తోంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టే ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు కూడా వైసీపీ అనుకూలంగా ఓటేయనుంది. ఆ మేరకు ఇటీవల ఢిల్లీ వెళ్లిన జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి హామీ ఇచ్చినట్టు వినికిడి.
పొత్తుల గురించి మాట్లాడి చులకన కాదలుచులేదంటూ చంద్రబాబు
ఇటీవల చంద్రబాబు, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా జరిగిన మంతనాలు ఎవరికీ తెలియదుగానీ, పొత్తుకు సానుకూల వాతావరణ ఏర్పడుతుందని భావించారు. కానీ, ఏపీ బీజేపీ చీఫ్ గా పురంధరేశ్వరిని నియమించిన తరువాత పొత్తు ఉండదని తెలిసిపోతోంది. పైగా పవన్ కల్యాణ్ బీజేపీ రూట్ మ్యాప్ ప్రకారం నడుచుకుంటున్నారు. తొలి రోజుల్లో సీఎం రేస్ ఉండదలుచుకోలేదని చెప్పిన ఆయన ఇప్పుడు (CBN Turning Point)మాటమార్చారు. సంతోషంగా సీఎం పదవి ఇస్తే తీసుకుంటానంటూ చెబుతున్నారు. ఇదంతా బీజేపీ ఆడిస్తోన్న రాజకీయ గేమ్ గా టీడీపీ గ్రహించింది. అందుకే, పొత్తుల గురించి మాట్లాడి చులకన కాదలుచులేదంటూ చంద్రబాబు రెండు రోజుల క్రితం మీడియా చిట్ చాట్ లో క్లారిటీ ఇచ్చేశారు. అంటే, ఒంటరి పోరుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.
కమలదళం ఎన్డీయేకు దూరమైన పాత మిత్రులను కలుపుకుని వెళ్లాలని
వాస్తవంగా ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు దాదాపుగా లేదు. కేవలం ఒకటి నుంచి రెండు శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ, ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ బలహీనతలతో ఆడుకుంటోంది. రెండు పార్టీలు బీజేపీకి మద్ధతు ఇవ్వడానికి పోటీపడుతున్నాయి. పలు సందర్భాల్లో ఎన్డీయేలో భాగస్వామ్యం కావాలని జగన్మోహన్ రెడ్డి మీద బీజేపీ ఢిల్లీ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. కానీ, క్రిస్టయన్ ఓట్లు పోతాయన్న అంచనా వేస్తూ ఎన్డీయేకు జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. అదే, చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామి కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయంలో బీజేపీ ఢిల్లీ పెద్దలు ఆచితూచి అడుగు వేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని టీడీపీతో కలిసి వెళ్లాలా? కేవలం జనసేనతో పొత్తు ఉంటే చాలా? అనే కోణం నుంచి.(CBN Turning Point) ఆలోచిస్తున్నారట.
Also Read : CBN Fight : ఢిల్లీ వరకు చంద్రబాబు పోరుబాట
ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో మారుతోన్న పరిణామాలకు అనుగుణంగా పావులు కదుపుతోన్న కమలదళం ఎన్డీయేకు దూరమైన పాత మిత్రులను కలుపుకుని వెళ్లాలని చూస్తోంది. ఆ క్రమంలో అన్నాడీఎంకే, తమిళ్ మనీలా కాంగ్రెస్, పీఎంకే, లోక్ జనశక్తి, హిందుస్తానీ ఆవామ్ మోర్చాకు ఆహ్వానాలు పంపారు. శిరోమణి ఆకాలీ దళ్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని శివసే, ఎన్సీపీ చీలిక వర్గాలకు ఆహ్వానాలు పంపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జనసేన మాత్రమే ఆహ్వానం అందింది. ఏపీ వరకు మాత్రమే బీజేపీ, జనసేన పొత్తును పరిమితం చేసింది. తెలంగాణలో పొత్తు లేదనే(CBN Turning Point) సంకేతాలు ఇస్తోంది. ఇదే ఈక్వేషన్ ను టీడీపీ విషయంలోనూ పాటిస్తుందా? లేదా దూరంగా టీడీపీని పెడుతుందా? అనేది పెద్ద చర్చ. ఈనెల 18వ తేదీన జరిగే ఎన్డీయే మీటింగ్ తో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య నడుస్తోన్న గేమ్ కు ఫుల్ స్టాప్ పడనుంది.
Also Read : CBN P4 Formula : `పూర్ టూ రిచ్ `తో ఆర్థిక విప్లవం