Lok Sabha polls: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే దూరం
- By Latha Suma Published Date - 12:32 PM, Tue - 12 March 24

Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha polls) పోటీకి దూరంగా ఉండనున్నారని సమాచారం. తాను పోటీలో ఉంటే దేశవ్యాప్తంగా పార్టీ ప్రచార కార్యక్రమాల్లో కష్టం అవుతుందన్న భావనలో ఖర్గే ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే ఆయన ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారని తెలుస్తోంది. తాను ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాలని కోరుకోవడం లేదని, దేశమంతటా దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నట్టు ఖర్గే తెలిపారు. కాగా,పలువురు సీనియర్ నాయకులు కూడా తాజా పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగాలనుకోవడం లేదని, తమ వారసులను పోటీకి దింపాలని భావిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కర్ణాటకలోని గుల్బర్గా నియోజకవర్గం నుంచి ఖర్గే పోటీ చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. గత వారం గుల్బర్గా నియోజకవర్గం కోసం చర్చించిన కర్ణాటక అభ్యర్థుల జాబితాలో ఖర్గే పేరు కూడా ఉంది. తన అల్లుడు రాధాకృష్ణన్ దొడ్డమణిని ఇక్కడ నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఖర్గే ఉన్నారని ఆయన ఆయన సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి. ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన ఆసక్తిగా లేరని సమాచారం. దీంతో అల్లుడిని పోటీకి దింపాలని ఖర్గే భావిస్తున్నారు.
read also:Haryana Crisis : సీఎం ఖట్టర్ రాజీనామా.. బీజేపీకి జేజేపీ గుడ్‌బై.. ఎందుకు ?
గుల్బర్గా నియోజకవర్గం నుంచి ఖర్గే రెండుసార్లు ఎంపీగా గెలిచారు. 2019లో మాత్రం ఆయన ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పెద్దల సభలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. ఎగువ సభలో ఆయనకు మరో నాలుగేళ్లు మిగిలి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు ఎన్నికల్లో పోటీ చేయని దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరూ పోటీ చేసి గెలిచారు. రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేయగా ఒక చోట మాత్రం ఓడిపోయారు. కాగా, తాను గెలిచిన వయనాడ్ నియోజకవర్గం నుంచే ఈసారి కూడా రాహల్ గాంధీ పోటీ చేయనున్నారు. వృద్ధప్య సమస్యలతో సోనియా గాంధీ పోటీకి దూరంగా ఉన్నారు.