HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >China Building Villages Near Doklam In Bhutan

China In Doklam : డోక్లాం శివార్లలో చైనా గ్రామాలు.. భారత్‌లోని సిలిగురి కారిడార్‌కు గండం

2016 నుంచి 2020 సంవత్సరం మధ్యకాలంలో మరో 14 గ్రామాలను కూడా డోక్లాం(China In Doklam) సమీపంలో చైనా కట్టించింది.

  • Author : Pasha Date : 18-12-2024 - 11:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
China In Doklam Bhutan India

China In Doklam : ఓ వైపు భారత్‌తో స్నేహం చేస్తున్న చైనా.. మరోవైపు భూటాన్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆ చిన్న దేశంలో యథేచ్ఛగా దురాక్రమణను కొనసాగిస్తోంది.  డోక్లాం  అనేది భూటాన్ భూభాగం. ఇది భారతదేశంలోని సిక్కిం రాష్ట్రానికి సమీపంలోనే ఉంటుంది. అందుకే వ్యూహాత్మకంగా భారతదేశానికి డోక్లాం కీలకమైన పాయింట్. అలాంటి డోక్లాం ప్రాంతానికి సమీపంలో 2020 సంవత్సరం నుంచి ఇప్పటివరకు చైనా 8 గ్రామాలను నిర్మించిందట. తాజాగా తీసిన శాటిలైట్ ఫొటోలతో ఈవిషయం స్పష్టమైంది. ఈ 8 గ్రామాలు కూడా చైనా సైనిక స్థావరాలకు సమీపంలోనే ఉండటం గమనార్హం.2016 నుంచి 2020 సంవత్సరం మధ్యకాలంలో మరో 14 గ్రామాలను కూడా డోక్లాం(China In Doklam) సమీపంలో చైనా కట్టించింది. అంటే గత ఎనిమిదేళ్లలో మొత్తం 22 చైనా గ్రామాలు డోక్లాం సమీపంలో వెలిశాయి.  మొత్తం మీద ఆ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని చాటుకునే ప్రయత్నాల్లో చైనా ఉందనేది విస్పష్టం.

Also Read :Diabetic Retinopathy : పెరుగుతున్న డయాబెటిక్‌ రెటీనోపతి కేసులు.. ఏమిటీ వ్యాధి ?

సిలిగురి కారిడార్ అనేది ఈశాన్య భారతదేశంలో 8 రాష్ట్రాల రైలు, రోడ్డు రవాణా మార్గాలకు వెన్నెముక లాంటిది. ఒకవేళ భూటాన్‌లోని డోక్లాంలో చైనాకు పట్టు పెరిగితే.. అది సిలిగురి కారిడార్‌కు ముప్పును తెస్తుందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు  పైప్‌లైన్లు, కమ్యూనికేషన్‌ కేబుల్స్‌ కూడా ఇదే మార్గంలో వెళ్తాయి. సిలిగురి కారిడార్‌కు చాలా దగ్గరలో చైనాకు చెందిన చుంబీ లోయ ఉంది.

Also Read :New Revenue Act : ఇవాళ అసెంబ్లీలోకి ‘కొత్త రెవెన్యూ చట్టం’ బిల్లు.. కీలక అంశాలివీ

సిలిగురి కారిడార్‌పై చైనా దాడి చేస్తే..

ఒకవేళ సిలిగురి కారిడార్‌పై చైనా దాడి చేస్తే.. భారత్‌‌లోని ప్రధాన భూభాగం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు లింక్ కట్ అవుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అదే జరిగితే ఈశాన్య రాష్ట్రాలకు సైన్యం తరలింపు, ఆయుధాల తరలింపు కష్టతరంగా మారుతుంది. అందుకే భూటాన్‌లోని డోక్లాంలో చైనా పట్టు పెరగడాన్ని భారత్ మొదటినుంచీ వ్యతిరేకిస్తోంది.  ఈవిషయంలో భారత్-చైనా సైన్యాల మధ్య  2017లో 72 రోజుల పాటు ప్రతిష్టంభన నడిచింది. అప్పట్లో దౌత్యపరమైన చర్యలతో  సమస్య పరిష్కారమైంది. అయినా డోక్లాంలో చైనా యాక్టివిటీ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రస్తుతం చైనాకు భారత్ చేరువైంది. ఈ తరునంలో డోక్లాం వ్యవహారంలోకి తలదూర్చకపోవచ్చని అంచనా వేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhutan
  • china
  • China villages
  • Doklam
  • india

Related News

Zero Tariffs

మే 1 నుండి దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దు!

ఆఫ్రికా నుండి తక్కువ ధరకే ముడి సరుకులు, వనరులు సులభంగా లభిస్తాయి. ప్రపంచ వేదికపై అమెరికా వంటి దేశాలు టారిఫ్‌ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తుంటే చైనా మాత్రం తాము ‘స్వేచ్ఛా వాణిజ్యానికి, సహకారానికి’ సిద్ధమని చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది.

  • Strait Of Hormuz

    మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం.. భారీ తీర్మానానికి అడ్డుప‌డిన వీటో ప‌వ‌ర్‌!

Latest News

  • Pooja Hegde : పూజా హగ్దే సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందా ?

  • Curd : ఏంటి మీ ఇంట్లోని పెరుగు పుల్లగా ఉంటుందా..? అయితే ఈ చిన్న చిట్కా తో పులుపు అనేది ఉండదు !!

  • Pawan Kalyan : ఓటమికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా..ఏయూ వేదికగా పవన్ సంచలన వ్యాఖ్యలు

  • Obesity : హైదరాబాద్‌కు ఒబేసిటీ సెగ.. నిశ్శబ్ద మహమ్మారిలా మారుతున్న ఊబకాయం!

  • Cheating : కేంద్రం పథకం పేరుతో ఎమ్మెల్యేకు టోకరా కొట్టి డబ్బులు దండుకున్న సైబర్ నేరగాళ్లు

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd