Supplementary Result: సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల!
10వ తరగతిలో 23.85 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 23.71 లక్షల మంది విద్యార్థులు పరీక్షలో పాల్గొన్నారు.
- By Gopichand Published Date - 06:40 PM, Tue - 5 August 25

Supplementary Result: కేంద్రీయ మాధ్యమిక విద్యా మండలి (Supplementary Result) 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష 2025 ఫలితాలను ఈ రోజు విడుదల చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ రోల్ నంబర్‌ను ఉపయోగించి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు.
ఫలితాలను ఎలా చూసుకోవాలి?
విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా చూసుకోవడానికి కింద సూచించిన దశలను అనుసరించవచ్చు.
- results.cbse.nic.in లేదా cbseresults.nic.in అనే అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి.
- హోమ్ పేజీలో కనిపించే 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితం లింక్ పై క్లిక్ చేయండి.
- అవసరమైన లాగిన్ వివరాలను, ముఖ్యంగా మీ రోల్ నంబర్‌ను నమోదు చేయండి.
- వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- భవిష్యత్తు అవసరాల కోసం ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింటవుట్ తీసుకోవడం మంచిది.
- ఈ ఫలితాలను డిజిలాకర్ (DigiLocker) ద్వారా కూడా పొందవచ్చు.
Also Read: Spiders in Home : సాలీడు పురుగులు మీ ఇంట్లో అధికంగా తిరుగుతున్నాయా? అది దేనికి సంకేతమో తెలుసా!
పరీక్ష వివరాలు, ముఖ్య అంశాలు
10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జులై 15 నుండి జులై 22 వరకు జరిగాయి. వీటిలో కొన్ని సబ్జెక్టుల పరీక్షలు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, మరికొన్ని 10:30 నుండి 12:30 వరకు నిర్వహించారు. మొదటి రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరీక్ష జరిగింది. సీబీఎస్ఈ 10వ తరగతి మెయిన్ పరీక్షల ఫలితాలను మే 13, 2025న విడుదల చేసింది. ఆ పరీక్షలకు 23.71 లక్షల మంది విద్యార్థులు హాజరవగా, 93.66% ఉత్తీర్ణత నమోదైంది.
ఫలితంలో తనిఖీ చేయవలసిన వివరాలు
ఫలితాలను చూసుకున్నప్పుడు విద్యార్థులు కింద పేర్కొన్న వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవాలి:
- విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేరు.
- పరీక్ష పేరు, బోర్డు.
- సాధించిన మార్కులు, మొత్తం మార్కులు, ఉత్తీర్ణత స్థితి.
- స్కూల్ పేరు, రోల్ నంబర్, ఉత్తీర్ణ డివిజన్.
Also Read: Suryakumar Yadav: ఆసియా కప్ ముందు టీమిండియాకు గుడ్ న్యూస్!