HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Cabinet Meeting Led By Pm Modi Special Focus On Key Sectors

Pm Modi: ప్రధాని మోడీ నేతృత్వంలో కేబినెట్ భేటీ.. కీలక రంగాలపై స్పెషల్ ఫోకస్!

  • Author : Vamsi Chowdary Korata Date : 22-05-2026 - 8:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cabinet Meeting Led by PM Modi: Special Focus on Key Sectors!
Cabinet Meeting Led by PM Modi: Special Focus on Key Sectors!

‘వికసిత్ భారత్ 2047’ కేవలం ఒక నినాదం కాదని ప్రధాని మోదీ తెలిపారు. దీన్ని ఒక బాధ్యతగా, బలమైన నిశ్చయంగా భావించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కేంద్ర మంత్రిమండలితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఈ భేటీ సాగింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వానికి ఇది ఒక మధ్యంతర సమీక్షగా నిలిచింది.

పశ్చిమాసియా సంక్షోభం, ప్రధాని ఐదు దేశాల పర్యటన, ఇంధన పొదుపుపై పటిష్ఠ చర్యల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఏదో కీలక నిర్ణయం తీసుకోనుందని జోరుగా ప్రచారం జరిగింది.

పాలనా సంస్కరణలు

ఈ సమావేశంలో పాలనా సంస్కరణలు, ప్రభుత్వ పనితీరుపై ప్రధానంగా చర్చించారు. తొమ్మిదికి పైగా మంత్రిత్వ శాఖలు తమ ప్రగతి నివేదికలను ప్రధానికి సమర్పించాయి. అలాగే నీతి ఆయోగ్, క్యాబినెట్ సెక్రటరీ కూడా భవిష్యత్తు ప్రణాళికలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఫైళ్లను అత్యంత వేగంగా పరిష్కరించిన శాఖలను ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ నిర్ణయాలు వేగంగా అమలయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.

విదేశీ పర్యటన వివరాలు

ప్రధాని మోదీ ఇటీవలి ఐదు దేశాల పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు ఆయనను సత్కరించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల విజయాన్ని కూడా ప్రస్తావించారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ పర్యటన విశేషాలను వివరించారు. మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం, దాని వల్ల వచ్చే ఆర్థిక సవాళ్లపై మోదీ చర్చించారు. ఈ సంక్షోభం వల్ల దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొరియాలో, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా జెనీవాలో ఉన్నందున ఈ భేటీకి రాలేకపోయారు.

‘‘నిన్న జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం చాలా ఫలప్రదంగా సాగింది. దేశంలో ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ (జీవన సౌలభ్యం), ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (వ్యాపార సౌలభ్యం) మరింత మెరుగుపరచడంపై పరస్పర ఆలోచనలు, ఉత్తమ విధానాలను పంచుకున్నాం. వికసిత్ భారత్ అనే మన ఉమ్మడి కలను సాకారం చేసుకోవడానికి పాలనా సంస్కరణలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై కూడా చర్చించాం’’ – ప్రధాని మోదీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cabinet meeting
  • Governance Reforms
  • indian economy
  • Indian PM Narendra Modi
  • Viksit Bharat 2047

Related News

    Latest News

    • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

    • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

    • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

    • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

    • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd