Byjus : బైజూస్ సంస్థ కీలక నిర్ణయం
- By Latha Suma Published Date - 11:46 AM, Tue - 12 March 24
Byjus: ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్‌టెక్ కంపెనీగా ఉన్న బైజూస్ (Byjus) ఇప్పుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తీవ్ర ద్రవ్య కొరతను ఎదుర్కొంటోంది. సంస్థలోని ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా బెంగళూరు (Bengaluru)లోని ప్రధాన కార్యాలయం తప్ప దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీసులన్నింటినీ మూసివేయాలని నిర్ణయించింది (Byjus Shuts All Offices). ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లుగా జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. బెంగళూరు నాలెడ్జ్ పార్కులోని ఐబీసీ వద్ద ఉన్న ప్రధాన కార్యాలయం ఒకటి మాత్రమే కొనసాగుతుందని స్పష్టం చేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఆఫీసుల మూసివేత ప్రక్రియ గత కొన్ని నెలలుగా కొనసాగుతోందని తెలిపాయి. ఆయా ప్రాంతాల్లో బైజూస్ ఆఫీసుల లీజు గడువులు ముగిసిన వెంటనే ఎక్కడికక్కడ ఆఫీసులు మూసివేస్తున్నట్లు తెలిపాయి.
read also : Defamation Case: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై పరువునష్టం కేసు కొట్టివేత
దేశవ్యాప్తంగా బైజూస్ సంస్థలో సుమారు 14,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరినీ ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా (Work From Home) సంస్థ కోరినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న 1000 మంది సిబ్బంది సహా దేశవ్యాప్తంగా ఉన్న 300 ట్యూషన్ కేంద్రాల సిబ్బందికి మాత్రం వర్క్ ఫ్రం హోమ్ వర్తించదు. ట్యూషన్ కేంద్రాలు యథాతథంగా పనిచేస్తాయని సంబంధిత వర్గాలు చెప్పినట్లుగా సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఆరు నుంచి 10వ తరగతి విద్యార్థులు ఈ కేంద్రాలకు వచ్చి విద్యను అభ్యసిస్తూ ఉండటంతో వాటిని యథాతథంగా కొనసాగించాలని కంపెనీ నిర్ణయించినట్లు నివేదికలు వెల్లడించాయి.