Parliament : పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా
మోడీ 3.0 ప్రభుత్వం జూలై 23న 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది.
- By Latha Suma Published Date - 05:29 PM, Fri - 9 August 24

Parliament: పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. జూలై 22న వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మోడీ 3.0 ప్రభుత్వం జూలై 23న 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌పై సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇకపోతే .. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా నీట్ లీకేజీ వ్యవహారం, రైల్వే భద్రత తదితర అంశాలు ఉభయ సభలను కుదిపేశాయి.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, పార్లమెంట్ సమావేశాలు గత నెల22 నుండి ప్రారంభమైన విషయ తెలిసిందే. తొలి రోజు 2023-24 ఆర్థికసర్వేను ఆర్థిక మంత్రి లోక్ సభలో ప్రవేశపెట్టారు. “భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పటిష్టంగా ఉంది” అని ఈ ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. ఆ తర్వాత 23వ తేదీన 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఎన్డీయే కూటమి ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌పై ఉభయ సభల్లో వాడీవేడిగా చర్చ కొనసాగింది. చర్చ అనంతరం కేంద్ర బడ్జెట్‌కు సభ ఆమోదం తెలిపింది. ఇక ఈ సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకూ కొనసాగుతాయని ప్రభుత్వం ముందే ప్రకటించినప్పటికీ ఉభయ సభలు ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి.
Read Also: Black Neck: మెడ చుట్టూ నల్లగా ఉందా.. అయితే ఇలా చేయాల్సిందే!