parliament : మలి విడత ప్రారంభమై బడ్జెట్ సమావేశాలు.. వాయిదా
డీఎంకే ఎంపీలు నిజాయితీ లేనివారు. వారు తమిళనాడు విద్యార్థుల పట్ల నిబద్ధత కలిగి లేరు. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. వారి ఏకైక పని భాషా అడ్డంకులను పెంచడమే.
- By Latha Suma Published Date - 02:02 PM, Mon - 10 March 25

parliament : పార్లమెంట్ ఉభయ సభలు బీజేపీ, డీఎంకే నేతల మాటల యుద్ధంతో దద్దరిల్లాయి. సోమవారం (మార్చి 10) పార్లమెంట్ బడ్జెట్ రెండో సెషన్ ప్రారంభం కాగానే డీఎంకే ఎంపీలు లోక్ సభలో ఆందోళనకు దిగారు. డీలిమిటేషన్, త్రిభాషా సిద్ధాంతానికి వ్యతిరేకంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. డీఎంకే ఎంపీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుతో డీఎంకే రాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు.
Read Also: Pranay Murder case : ప్రణయ్ హత్య కేసు..కోర్టు సంచలన తీర్పు
డీఎంకే ఎంపీలు అప్రజాస్వామికులు, అనాగరికులు అంటూ కేంద్రమంత్రి ధరేంద్ర ప్రధాన్ నిప్పులు చెరిగారు. డీఎంకే ఎంపీలు నిజాయితీ లేనివారు. వారు తమిళనాడు విద్యార్థుల పట్ల నిబద్ధత కలిగి లేరు. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. వారి ఏకైక పని భాషా అడ్డంకులను పెంచడమే. విద్యను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. సభలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ లోక్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్య సభలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. డీలిమిటేషన్, త్రిభాషా సిద్ధాంతం, మణిపూర్ అలర్లపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. దీంతో డిప్యూటీ చైర్మన్ రాజ్య సభను వాయిదా వేశారు. బీజేపీ, డీఎంకే నేతల డైలాగ్ వార్తో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి.
పుర్వివభజనకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్ పార్టీల మద్దతు కూడగట్టాలని డీఎంకే నిర్ణయించింది. ఇక నకిలీ ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్)లపై కేంద్రాన్ని నిలదీయాలని టీఎంసీ నిర్ణయించింది. దీనిపై కలిసి రావాలని కాంగ్రెస్, డీఎంకే, శివసేన (ఉద్ధవ్)లను కోరింది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని కాంగ్రెస్ కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే.