Emergency Movie : కంగనకు షాక్.. బాంబే హైకోర్టులో ‘ఎమర్జెన్సీ’కి చుక్కెదురు
ఈవిషయంలో ఇంతకుముందు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా తాము ఆర్డర్స్ ఇవ్వలేమని న్యాయమూర్తులు బీపీ కొలబావల్లా, ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది.
- By Pasha Published Date - 05:03 PM, Wed - 4 September 24
Emergency Movie : బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాకు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. ఆ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)ను తాము ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఈవిషయంలో ఇంతకుముందు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా తాము ఆర్డర్స్ ఇవ్వలేమని న్యాయమూర్తులు బీపీ కొలబావల్లా, ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. సెప్టెంబర్ 18లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు న్యాయస్థానం సూచించింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.
We’re now on WhatsApp. Click to Join
వాస్తవానికి ఎమర్జెన్సీ మూవీ(Emergency Movie) సెప్టెంబర్ 6న రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మూవీలో తమను తప్పుడు కోణంలో చూపించారని పేర్కొంటూ సిక్కు వర్గం వారు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఆ హైకోర్టు.. వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. ఎమర్జెన్సీ మూవీకి సర్టిఫికెట్ ఇచ్చే ముందు సినిమాపై సిక్కు వర్గం వారు లేవనెత్తిన అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు కోర్టు నిర్దేశించింది. ఈనేపథ్యంలో సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో కంగనా రనౌత్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది.
Also Read :EPS Pensioners : గుడ్ న్యూస్.. ఇక ఏ బ్యాంకు నుంచైనా ఈపీఎస్ పెన్షన్
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ మూవీ తెరకెక్కుతోంది. ఈమూవీలో ఇందిరాగాంధీ పాత్రను కంగనా రనౌత్ పోషించారు. ఈ సినిమా డైెరెక్టర్ కూాడా ఆమెనే. అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాలో చరిత్రకు సంబంధించిన వాస్తవాలను తప్పుగా చిత్రీకరించారంటూ సెన్సార్ బోర్డుకు శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) పార్టీ లేఖ రాసింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరింది. ప్రేక్షకుల్లో ద్వేషాన్ని పెంచేలా ఈ మూవీ ఉందని తెలిపింది.
Also Read :SEBI Chief : సెబీ చీఫ్ టార్చర్ చేస్తున్నారు.. ఆర్థికశాఖకు 500 మంది అధికారుల ఫిర్యాదు
Related News
Kangana Ranaut : జయాబచ్చన్ పేరు వివాదం..ఇది చాలా చిన్న విషయం: కంగన
ఇది చాలా చిన్న విషయం అన్నారు. జయాబచ్చన్ స్పందించిన తీరును ఆమె తప్పుబట్టారు. స్త్రీ-పురుషుడు కలిస్తేనే ఒక జీవితం అందంగా ఉంటుందని హితవు పలికారు. ఇలాంటి చర్యల వల్ల స్త్రీ వాదం అనేది పక్కదారి పడుతుందన్నారు.