Lok Sabha Polls 2024: కేరళలో రెండంకెల సీట్లు గెలుస్తాం: మోదీ
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి రెండంకెల సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు .సెంట్రల్ స్టేడియంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేరళ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను నిజం చేసేలా చర్యలు
- Author : Praveen Aluthuru
Date : 27-02-2024 - 6:58 IST
Published By : Hashtagu Telugu Desk
Lok Sabha Polls 2024: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి రెండంకెల సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు .సెంట్రల్ స్టేడియంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేరళ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను నిజం చేసేలా చర్యలు తీసుకుంటామని మోడీ హామీ ఇచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో తమ పార్టీ కేరళ రాష్ట్రాన్ని ఎన్నడూ చూడలేదన్నారు.
2019లో బీజేపీ ఓట్ల శాతం రెండంకెలకు చేరుకోగా , 2024లో బీజేపీ రెండంకెల సీట్లు గెలుచుకోబోతోంది. లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీలో కేరళ కూడా భాగమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. వామపక్షాలు, కాంగ్రెస్ రెండు ఒకటే అన్నారు మోడీ .ఈ రెండు పార్టీలు కేరళలో శత్రువులుగా, బయట మిత్రులుగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ రెండు పార్టీల వల్ల కేరళలో అభివృద్ధి జరగలేదని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకున్నా, కేంద్ర ప్రభుత్వం కేరళకు పెద్దపీట వేసిందన్నారు. సీపీఎంపై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ రానున్నన లోక్‌సభ ఎన్నికలలో గెలవలేమని దృఢాభిప్రాయంతో ఉన్నదని ఎద్దేవా చేశారు మోడీ. కేరళ ప్రజలు రానున్న లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ నయవంచనకు సమాధానం ఇస్తారు అని మోడీ అన్నారు.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో పట్టుబడిన బైక్ దొంగలు