Delhi Election Results : ఓటర్లు ‘AAP’ ని చీపురుతో ఊడ్చేశారు – బండి సంజయ్
Delhi Election Results : ఈ ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ.. "ఢిల్లీ ప్రజలు ఆప్‌ను చీపురుతో ఊడ్చేశారు" అని అన్నారు
- By Sudheer Published Date - 12:00 PM, Sat - 8 February 25

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Delhi Election Results) బీజేపీ(BJP)కి అనుకూలంగా మారడంతో కాషాయ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మ్యాజిక్ ఫిగర్ అయిన 36ను బిజెపి దాటేసి పూర్తి మెజారిటీ దిశగా సాగుతోంది. అటు ఆప్ పార్టీ 28 స్థానాల్లో పోటీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు సంబరాలు మొదలుపెట్టారు. ఈ ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ.. “ఢిల్లీ ప్రజలు ఆప్‌ను చీపురుతో ఊడ్చేశారు” అని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన తప్పుడు వాగ్దానాలను, అవినీతి ఆరోపణలను ప్రజలు నమ్మలేదని స్పష్టం చేశారు. మెజార్టీ వర్గం పూర్తిగా బీజేపీ వైపు మొగ్గుచూపిందని , కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రధాని, రాష్ట్రపతిని అవమానించడమే కాకుండా, ప్రజాస్వామ్య విధానాలను దెబ్బతీసేలా పాలన సాగించిందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిపాలన పునరుద్ధరించాలని ఆశించిన ఢిల్లీ ప్రజలు, బీజేపీకి అధికారం కట్టబెట్టారని పేర్కొన్నారు.
Key Leaders Result: ఆప్ అగ్రనేతల్లో ఆధిక్యంలో ఎవరు ? వెనుకంజలో ఎవరు ?
ఢిల్లీ విజయంతో బీజేపీ “డబుల్ ఇంజిన్ సర్కార్” ఏర్పాటు చేస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కలిసి మరింత అభివృద్ధిని తీసుకరాగలదని స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా బీజేపీకి మెరుగైన భవిష్యత్తు ఉందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. “త్వరలో 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, భవిష్యత్తులో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ విజయం తెలంగాణలో బీజేపీకి మరింత బలాన్నిస్తుందని ఆయన అన్నారు.