Arvind Kejriwal: నేటితో ముగియనున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ
నేటితో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ కస్టడీ ముగియనుంది. మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు కేజ్రీవాల్ ఈడీ అధికారులు హాజరుపర్చనున్నారు.
- Author : Gopichand
Date : 28-03-2024 - 12:00 IST
Published By : Hashtagu Telugu Desk
Arvind Kejriwal: నేటితో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ కస్టడీ ముగియనుంది. మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు కేజ్రీవాల్ ఈడీ అధికారులు హాజరుపర్చనున్నారు. ఆరు రోజుల ఈడీ కస్టడీలో అరవింద్ కేజ్రీవాల్ నుంచి రాబట్టిన సమాచారాన్ని ఈడీ అధికారులు న్యాయమూర్తికి సమర్పించనున్నారు. లిక్కర్ పాలసీ విధానాలు, సౌత్ గ్రూప్ నుంచి సేకరించిన 100 కోట్ల రూపాయల ముడుపులు, పాలసీ విధానం ఎందుకు మార్చాల్సి వచ్చింది అనే అంశాలపై అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.
అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పొడిగించమని ఈడీ కోర్టును కోరనుంది. నేడు కోర్టులో ఈడీ, అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదనలు కీలకంగా మారనున్నాయి. సునీతా కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ భార్య ఈ విషయమై ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈడీ కస్టడీలో ఉన్న నా భర్త అరవింద్ కేజ్రీవాల్ ను కలిశానని ఆమె ఇటీవల తెలిపింది. కేజ్రీవాల్ కి డయాబెటిస్ ఉంది. షుగర్ లెవల్ సరిగా లేదని పేర్కొంది. గడిచిన రెండేళ్లలో ఈడీ 250పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిందని ఆమె పేర్కొంది.
Also Read: Bandi Sanjay: తెలంగాణ ఖజనా ఖాళీ అయ్యింది.. జీతాలు ఇవ్వడమే గగనం
లిక్కర్ కేసులో ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఒక్క పైసా కూడా దొరకలేదని తెలిపింది. సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్ నివాసంలో ఒక్క పైసా కూడా దొరకలేదని తెలిపింది. లిక్కర్ కేసు డబ్బు ఎక్కడ ఉందో..? కేజ్రీవాల్ కోర్టులో దేశ ప్రజలకు చెబుతారు. దాని ఆధారాలు కూడా చెబుతారని ఆమె స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ నిజమైన దేశ భక్తుడని, కేజ్రీవాల్ శరీరం జైల్లో ఉంది..ఆత్మ ప్రజల్లో ఉందని చెప్పారు.
We’re now on WhatsApp : Click to Join