Arvind Kejriwal: హర్యానాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం: కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ, పంజాబ్‌లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని... హర్యానాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అందుకే తనను మోడీ అడ్డుకోవాలని చూశాడని ఆరోపించారు.
- By Latha Suma Published Date - 05:40 PM, Sun - 29 September 24

Haryana Assembly Elections: ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలోకి వచ్చిందని… అందుకే తనను ఆపాలని జైలుకు పంపారని ఆ పార్టీ ఛీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురుగ్రామ్‌లో ఆప్ అభ్యర్థి తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోడీ టార్గెట్‌గా కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ, పంజాబ్‌లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని… హర్యానాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అందుకే తనను మోడీ అడ్డుకోవాలని చూశాడని ఆరోపించారు. ఢిల్లీలో 500 క్లినిక్‌లు ఏర్పాటు చేశానని… దేశ వ్యాప్తంగా 5 వేల క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
Read Also: R. Krishnaiah : ఎంపీ పదవి చిన్నదంటూ ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
కాగా, హర్యానా అసెంబ్లీ ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గత శుక్రవారంనాడు శ్రీకారం చుట్టారు. యమునానగర్‌లోని జగాధరి అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం 11 జిల్లాల్లో 13 ర్యాలీల్లో కేజ్రీవాల్ పాల్గోనున్నారు. హర్యానాలోని 90 నియోజకవర్గాలకు ‘ఆప్’ సొంతంగానే పోటీ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డబ్‌వాలీ, రానియా, భివాని, మెహమ్, పుండ్రి, రేవారి, దాద్రి, అస్సాంథ్, బల్లడ్‌గఢ్, బద్ర నియోజకవర్గాల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. కీలక నగరాల్లో ర్యాలీలు నిర్వహించి ప్రధానంగా స్థానిక అంశాలపై ప్రసంగించనున్నారు. హర్యానాలో కాంగ్రెస్‌తో సీట్ల షేరింగ్ వ్యవహారంలో అవగాహన కుదరకపోవడంతో ఆప్ సొంతంగానే ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసిందే.