R. Krishnaiah : ఎంపీ పదవి చిన్నదంటూ ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
R. Krishnaiah : 'జగన్ కు నష్టం చేయాలని లేదు. నా 50 ఏళ్ల పోరాటంలో ఎంపీ చిన్న పదవి. దాని వల్ల నాస్థాయి తగ్గింది'
- By Sudheer Published Date - 05:36 PM, Sun - 29 September 24

రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన కృష్ణయ్య (R. Krishnaiah) ..కీలక వ్యాఖ్యలు చేసారు. బీసీల తరఫున పోరాటం చేస్తారని వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ మీకు ఆ పదవి కేటాయిస్తే..మీరు ఇంకో నాలుగేళ్ళ పదవి కాలం ఉండగానే రాజీనామా చేయడం కరెక్టేనా? అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘జగన్ కు నష్టం చేయాలని లేదు. నా 50 ఏళ్ల పోరాటంలో ఎంపీ చిన్న పదవి. దాని వల్ల నాస్థాయి తగ్గింది’ అని కృష్ణయ్య సమాధానం చెప్పుకొచ్చారు. మరి ఆ పదవి ఇప్పుడు టీడీపీ కి వెళ్తుందిగా..? అని ప్రశ్నించగా, ఎవరికైనా వెళ్లనీ అని
కృష్ణయ్య పేర్కొన్నారు.
ఇప్పటికే వైసీపీ (YCP) పార్టీకి ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు గుడ్ బై చెప్పగా..ఇప్పుడు ముచ్చటగా మూడో సభ్యుడు ఆర్.కృష్ణయ్య గుడ్ బై చెప్పి..భారీ షాక్ ఇచ్చారు. కృష్ణయ్య తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కు పంపగా.. వెంటనే రాజీనామాను ఆమోదించారు. వైసీపీ నుంచి 2022లో ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీసీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసేందుకే రాజీనామా చేసినట్లు ఆర్.కృష్ణయ్య తెలిపారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని విస్తరించడంపై ఆర్.కృష్ణయ్య దృష్టిపెట్టారు.
తొలుత తెలంగాణలో టీడీపీ పార్టీ ఏకంగా నాయకత్వం బాధ్యతలను కృష్ణయ్యకు అప్పగించింది. అసెంబ్లీ టికెట్ కూడా కేటాయించింది. ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలిచారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి.. కృష్ణయ్యను పిలిచి మరీ రాజ్యసభ స్థానాన్ని కట్టబెట్టింది. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ పై అనేక విమర్శలు వచ్చాయి. అయినా సరే పార్టీకి పనికొస్తుందని ఆయన భావించారు. కానీ జగన్ కు షాక్ ఇచ్చాడు. మరి కృష్ణయ్య బిజెపి లో చేరతారా..? లేక కాంగ్రెస్ లో చేరతారా అనేది చూడాలి.
Read Also : Kitchen Tips : ఇంట్లో గ్యాస్ సిలిండర్ త్వరగా ఖాళీ అవుతుందా?: ఈ ట్రిక్స్ పాటించండి..!