HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Anil Vij Eyes Haryana Cm Post Despite Bjp Backing Saini

Haryana election: బీజేపీ గెలిస్తే హర్యానా సీఎం నేనే

Haryana election: హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే నేనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నాను చెప్పారు అనిల్ విజ్.ఈ బాధ్యత అప్పగిస్తే నేను హర్యానా ముఖచిత్రాన్ని మారుస్తానని చెప్పాడు. కాగా బీజేపీ హైకమాండ్ విజ్‌కి అంబాలా కాంట్ నుండి టిక్కెట్ కేటాయించింది

  • Author : Vamsi Chowdary Korata Date : 16-09-2024 - 12:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Haryana election
Haryana election

Haryana election: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బీజేపీ నేత, రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ విజ్(Anil Vij) ముఖ్యమంత్రి పదవికి పెద్దపీట వేశారు. తానే సీఎం పదవికి పోటీదారునని ప్రకటించుకున్నారు. భవిష్యత్తులో సీఎం అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు.

హర్యానా నుంచి సీఎం అభ్యర్థి ఎవరనేది బీజేపీ ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం. ప్రస్తుత సీఎం నయాబ్ సైనీని కొందరు సీఎం అభ్యర్థిగా పేర్కొంటున్నారు. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. కాగా అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. అనిల్ విజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి నుండి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేని మరియు 6 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని అన్నారు. ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు ఏడోసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. ఇప్పటి వరకు నేను పార్టీని ఏమీ అడగలేదు. ఈసారి ఎన్నిక‌ల‌కు ముందు చాలా మంది వ‌చ్చి న‌న్ను క‌లిసి సీఎం అభ్య‌ర్థిగా ప్రమోట్ చేశారని చెప్పుకొచ్చారు.

హర్యానా ఎన్నికల్లో(Haryana elections) బీజేపీ విజయం సాధిస్తే నేనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నాను చెప్పారు అనిల్ విజ్.ఈ బాధ్యత అప్పగిస్తే నేను హర్యానా ముఖచిత్రాన్ని మారుస్తానని చెప్పాడు. కాగా బీజేపీ హైకమాండ్ విజ్‌కి అంబాలా కాంట్ నుండి టిక్కెట్ కేటాయించింది. అటు నిన్న ఆదివారం, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాయబ్ సైనీని హర్యానా ముఖ్యమంత్రి ముఖంగా అభివర్ణించారు. ఆయన నాయకత్వంలోనే పార్టీ రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయాలు సాధిస్తుందని అన్నారు. నిజానికి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ఈ ప్రకటన అనివ్ విజ్ సీఎంగా ప్రకటించుకున్న తర్వాత వచ్చింది. కాగా ధర్మేంద్ర ప్రధాన్‌ను హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.

ఇదిలా ఉండగా హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తారో కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ చెప్పారు. హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తున్నదని చెప్పారు. ప్రచార కార్యక్రమాలకు భారీగా జనం వస్తున్నారన్నారు. 2005లో కాంగ్రెస్ పార్టీకి 67 సీట్లు రాగా, ఈసారి అంతకంటే ఎక్కువ ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. ఈసారి 70 సీట్లకు పైగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Also Read: Kriti Sanon: బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిసిపోతున్న కృతి సనన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anil Vij
  • Assembly Elections 2024
  • bjp
  • CM candidate
  • CM Post
  • congress
  • haryana
  • Haryana election
  • live updates
  • Saini

Related News

Indiramma Houses

CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సోమ‌వారం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండవ దశను ప్రారంభించనున్నారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ పథకం మొదటి దశ కింద కేరమేరి మండలం, కొత్తారి గ్రామంలో కోలం తెగకు చెందిన ఆదివాసుల కోసం నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహప్రవేశం చేస్తారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండ

  • Dk Shivakumar

    Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • Balka Suman

    BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • CM Revanth Reddy

    Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd