MCD Elections : ఆప్ ఎమ్మెల్యేను దారుణంగా కొట్టిన జనం…వీడియో షేర్ చేసిన బీజేపీ..!!
- By hashtagu Published Date - 05:22 AM, Tue - 22 November 22

మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీల మధ్య గట్టి పోటీనెలకొంది. ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ను జనాలు కొట్టిన వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది. ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలతో ఎమ్మెల్యేను కొట్టినట్లు సమాచారం.
అయితే బీజేపీ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఏ చిన్న క్లూ దొరికినా దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దాడులకు దిగుతోంది. ఒక్కోసారి స్టింగ్ ద్వారా అవినీతి ఆరోపణలను బయట పెడుతూ..వీడియోలను బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ ఎపిసోడ్ లో ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ వీడియోను ట్వీట్ చేసింది. ఆ వీడియోలో గులాబ్ సింగ్ జనం విపరీతంగా కొడుతున్నట్లు ఉంది.
पैसे लेकर टिकट बेचने के आरोप में आम आदमी पार्टी विधायक गुलाब सिंह यादव की समर्थकों ने पिटाई कर दी । pic.twitter.com/9GdiM6d64X
— Tajinder Bagga (@TajinderBagga) November 21, 2022
కాగా ఈ వీడియో లీక్ ఆమ్ ఆద్మీ ఇంతవరకు స్పందించలేదు. నిజమైన రాజకీయాలు చేస్తున్న పార్టీ కార్యాలయం నుంచి ఈ ఊహించని వీడియో బయటకు రావడతో ఆప్ నేతలకు నోరు రావడం లేదంటూ బీజేపీ నేత సంబిత్ పాత్ర ట్వీట్ చేశారు. ఆప్ అవినీతి ఎలా ఉందంటే సొంత కార్యకర్తలే ఎమ్మెల్యే కొట్టిలా ఉండటం అంటూ సెటైర్లు వేశారు. ఎంసీడీ ఎన్నికల్లో ఇలాంటి ఫలితం రానుందని పేర్కొన్నారు.
ఆప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. హఠాత్తుగా ఈ సమావేశంలో రచ్చ మొదలైంది. కొంతమంది కార్యకర్తలు ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యేను విపరీతంగా కొట్టారు. గులాబ్ సింగ్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పరిగెత్తుతున్న గులాబ్ సింగ్ వెంబడించి మరి కొట్టారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఆమ్ ఆద్మీలో చేరిన ఓ నేతను రూ. 80లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో ఈ దాడి జరిగినట్లు సమాచారం. అయితే ఈ వీడియో ఫేక్ అంటూ ఆప్ కొట్టిపారేసింది.