Aam Aadmi Party : ఈరోజు సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ పీఏసీ సమావేశం
Aam Aadmi Party PAC meeting today: కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీ సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే దానిపై ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో ఆప్ నేత మనీష్ సిసోడియా సమావేశమయ్యారు.
- By Latha Suma Published Date - 01:41 PM, Mon - 16 September 24

Aam Aadmi Party PAC meeting today: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామ చేస్తానన్న స్టేట్‌మెంట్‌తో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో తదుపరి సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీ సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే దానిపై ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో ఆప్ నేత మనీష్ సిసోడియా సమావేశమయ్యారు. కొత్త ముఖ్యమంత్రి పేరుపై చర్చ జరిగే అవకాశం ఉంది.
Read Also: Kohli Breaks Wall: కోహ్లీ స్ట్రోక్ కి చెపాక్ స్టేడియంలో పగిలిన గోడ
కాగా, మనీశ్ సిసోడియా సైతం సీఎం పదవి చేపట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారనే ఓ ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఆయన సైతం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీఎం పీఠంపై కూర్చోబెడతారా? అంటే సందేహమేననే ఓ చర్చ సైతం సాగుతుంది. మరోవైపు కేజ్రీవాల్ భార్య సునీతతోపాటు మరో ఐదుగురు పేర్లు.. అతిషి, సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గహ్లోత్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఢిల్లీ సీఎం పేరు మంగళవారం దాదాపుగా ఖరారవుతుందని తెలుస్తుంది.
2025, ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఈ ఎన్నికలు.. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరపాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. అదీకాక మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని కేజ్రీవాల్ నిర్ణయించారు. అదే జరిగితే.. ఈ ఏడాది చివరి లోపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. దీంతో ఢిల్లీ ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారనే విషయం సుస్పష్టం కానుంది.